Breaking News

కెనడాలో విమాన ప్రమాదం..రన్‌వేపై మంటలు

Published on Sun, 12/29/2024 - 12:15

ఒట్టావా:ఈ ఏడాది ముగుస్తుందనగా వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మరో రెండు రోజుల్లో 2024కు వీడ్కోలు పలకనున్న సమయంలో శనివారం(డిసెంబర్‌28) రాత్రి దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు తప్ప మొత్తం 179 మరణించినట్లు తెలుస్తోంది. ల్యాండిగ్‌ గేర్‌ విఫలమవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. 

ఇదే తరహా భారీ విమాన ప్రమాదం కెనడాలో శనివారం రాత్రి తృటిలో తప్పింది. ఎయిర్‌కెనడాకు చెందిన విమానం హలిఫాక్స్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ గేర్‌ విఫలమై అత్యవసరంగా ల్యాండయింది.  ల్యాండయ్యే సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పింది. దీంతో విమానం రెక్క రన్‌వేకు రాసుకుంటూ పోయి మంటలు లేచాయి. 

అయితే ఎమర్జెన్సీ బృందాలు సత్వరమే స్పందించి మంటలార్పాయి. దీంతో ప్రాణ నష్టం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విమానం ల్యాండ్‌ అయిన వెంటనే పెద్ద శబ్దం వచ్చిందని, భారీ ప్రమాదం జరిగి ఉంటుందనుకున్నామని ఓ ప్రయాణికుడు తెలిపారు.

కాగా, కొద్ది రోజుల క్రితమే కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలి అందులోని ప్రయాణికుల్లో చాలా మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ జరిపిన కాల్పులే కారణమని ప్రచారం జరిగింది. తాజాగా పుతిన్‌ ఈ విషయమై క్షమాపణ కూడా చెప్పారు. అయితే విమాన ప్రమాదానికి తామే కారణమని రష్యా స్పష్టంగా ఎక్కడా ఒప్పుకోకపోవడం గమనార్హం. 

ఇదీ చదవండి: ద.కొరియాలో విషాదం..179 మంది దుర్మరణం​

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)