Breaking News

Happy Africa Day: మూడొంతుల భాషలు ఇక్కడివే..

Published on Sun, 05/25/2025 - 11:27

ఆఫ్రికాఖండం(Africa) పేరు వినగానే మనకు వలసవాదం, వర్ణవిక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు గుర్తుకువస్తాయి. ఆఫ్రికాలో విభిన్న సంస్కృతులు, భాషలు కనిపిస్తాయి. అలాగే ఇక్కడి చరిత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు(మే 25) ఆఫ్రికా దినోత్సవం. ఈ సందర్బంగా ఈ ఖండానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆఫ్రికా ఖండంలోని విభిన్న సంస్కృతులు, చరిత్ర, విజయాలను  గుర్తు చేసుకునేందుకు ప్రతియేటా మే 25న ఆఫ్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1963 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ (ఓఏయూ) స్థాపనకు సూచికగా ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు.  దీనిని ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్(African Union) (ఏయూ)గా పిలుస్తున్నారు. ఈ సంస్థ 2002, జూలై 9న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఆఫ్రికన్ యూనియన్‌గా రూపాంతరం చెందింది. ఈ రోజు ఆఫ్రికా అంతటా సెలవు దినం. ఆఫ్రికన్ దేశాల ఐక్యత, సామాజిక-ఆర్థిక పురోగతి, సమిష్టి ఆకాంక్షలను ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది.

ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద, అత్యధిక జనాభా కలిగిన ఖండంగా ఆఫ్రికా ప్రసిద్ధి చెందింది. ఆఫ్రికాలో మొత్తం 54 దేశాలు ఉన్నాయి. ఈ ఖండంలో దాదాపు  రెండు వేల భాషలు మాట్లాడే ప్రజలున్నారు. ప్రపంచంలోని మూడొంతులు భాషలు ఈ ఖండంలోనే కనిపిస్తాయి.  హావర్డ్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని దాదాపు మూడింట ఒక వంతు భాషలకు ఆఫ్రికా నిలయంగా ఉంది. నేడు  ఆఫ్రికా దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఆఫ్రికన్ ఐక్యతను ప్రోత్సహించేందుకు, ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు నేడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజిల్స్ లాంటి నగరాల్లో ఆఫ్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)