Breaking News

US: ట్రంప్‌ కేసులో శృంగార తార స్టార్మీ సంచలన ప్రకటన

Published on Tue, 01/16/2024 - 21:23

న్యూయార్క్‌: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇప్పటికే దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన అయోవా రిపబ్లికన్‌ ప్రైమరీ బ్యాలెట్‌లో ఘన విజయం సాధించారు. దీంతో వివేక్‌ రామస్వామి లాంటి ప్రత్యర్థి ఏకంగా రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ పోటీ నుంచే తప్పుకున్నారు.

ఇదిలాఉంటే ట్రంప్‌కు తాజాగా మరో న్యాయపరమైన తలనొప్పి వచ్చి పడింది. శృంగార స్టార్మీ డేనియల్స్‌ హుష్‌ మనీ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతానని ప్రకటించి పెద్ద బాంబు పేల్చింది. ఈ కేసులో మార్చిలో మన్‌హట్టన్‌ కోర్టు ముందు హాజరవుతానని చెప్పింది. 2016 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తనకు ట్రంప్‌ అక్రమ పద్ధతిలో పేమెంట్‌ ఇచ్చారని, ఇందు కోసం ఆయన తన బిజినెస్‌ రికార్డులను తారుమారు చేశారని స్టార్మీ ఆరోపిస్తోంది.

తనకు ట్రంప్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని గతంలోనే ఆరోపణలు చేసి స్టార్మీ సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆమె కోర్టుకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏం చెబుతుంది దాని పరిణామాలేంటన్నదానిపై ట్రంప్‌ వర్గంలో ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఇదే కేసులో ట్రంప్‌ తరపున వాదిస్తున్న అగ్రశ్రేణి న్యాయవాది జో టాకోపినా తాను ఇక ఆయన తరపున వాదించనని సోమవారం కోర్టుకు తెలిపారు. ఒక పక్క అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోతున్న ట్రంప్‌కు కేసుల తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. 

ఇదీచదవండి.. బ్యాంకులతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి చర్చలు 
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)