Nigeria: ఘోర పడవ ప్రమాదం.. 60 మంది మృతి

Published on Thu, 09/04/2025 - 08:05

అబుజా: ఉత్తర-మధ్య నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. వంద మందితో ప్రయాణిస్తున్న పడవ నీట మునగడంతో  60 మంది మృతి చెందారు. మలాలే జిల్లాలోని తుంగన్ సులే నుండి బయలుదేరిన ఈ పడవ గౌసావా కమ్యూనిటీ సమీపంలో ఒక చెట్టు మొద్దును ఢీకొనడంతో బోల్తా పడింది. స్థానిక ప్రభుత్వ ప్రాంత చైర్మన్ అబ్దుల్లాహి బాబా అరా మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నదన్నారు. పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 60 కి చేరిందని తెలిపారు. పది మంది పరిస్థితి విషమంగా ఉందని, గల్లంతైన వారి కోసం వెదుకులాట జరుగుతున్నదన్నారు.
 

షాగుమి జిల్లా అధికారి సాదు ఇనువా మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే తాను సంఘటన స్థలానికి చేరుకున్నానని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో వందమంది ప్రయాణిస్తున్నారన్నారు. తొలుత 31 మృతదేహాలను వెలికితీశారన్నారు. గల్లంతైనవారి కోసం అత్యవసర సిబ్బంది వెదుకుతున్నారని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటివరకు 50 మందిని రక్షించారని తెలిపింది. పడవ ఓవర్‌లోడ్ అయి చెట్టు మొద్దును ఢీకొట్టిందని, దీంతో అది బోల్తా పడి, ప్రమాదం జరిగిందని ఏజెన్సీ తెలిపింది. నైజీరియాలో, ముఖ్యంగా వర్షాకాలంలో భద్రతా  లోపాలు,  సరైన నిర్వహణలేని ఓడల వాడకం కారణంగా పడవ ప్రమాదాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)