Breaking News

Gaza: ఆకలి కేకలు.. 48 మంది దుర్మరణం

Published on Sun, 08/03/2025 - 07:43

యుద్ధం కారణంగా గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతంలో మానవతా సహాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొకవైపు విషాద ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం గాజాలోని జికిమ్ క్రాసింగ్‌లో  ఆహారం కోసం  జనం ఎగబడటంతో 48 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని, పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారని స్థానిక మీడియా తెలిపింది.

మానవతా సహాయ బృందం క్రాసింగ్‌కు చేరుకున్న సమయంలో, ఆహారం కోసం బాధితులు ఎగబడినప్పుడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాజా సిటీలోని షిఫా హాస్పిటల్ ఈ ఘటనలో మృతుల సంఖ్యను 48గా నిర్ధారించింది. మానవతా సహాయ బృందం నుంచి కొందరు పిండి సంచులను తీసుకుని పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్‌ పోలీసులు జనసమూహంపై కాల్పులు జరిపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక దాడి, కఠినమైన దిగ్బంధనం కారణంగా గాజాలో సంక్షోభం మరింత తీవ్రమయ్యింది.

ఈ పరిస్థితుల  నేపధ్యంలో గాజాలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ప్రముఖ అంతర్జాతీయ  సంస్థ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిషికేషన్‌ (ఐపీసీ) గాజాలో కరువు తీవ్రతపై హెచ్చరించింది. తక్షణ చర్యలు లేకపోతే మరిన్ని మరణాలు నమోదవుతాయని పేర్కొంది. మానవతా సహాయ సంస్థలు మరింతగా ముందుకు రావాలని కోరింది. గాజాలోకి మరింత మానవతా సహాయాన్ని అనుమతించడానికి అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచుతోంది. యూఎన్ తెలిపిన వివరాల ప్రకారం గాజాకు 600 ట్రక్కుల మానవతా సహాయం అందగా, 220 ట్రక్కుల సామాగ్రిని మాత్రమే అనుమతించారు. మానవతా సహాయాన్ని అందుకునే దిశగా జరుగుతున్న తొక్కిసలాటల్లో ఇప్పటి వరకూ వెయ్యిమంది పాలస్తీనియన్లు మృతిచెందారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)