Breaking News

సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే..

Published on Wed, 08/02/2023 - 09:12

రియో డి జనేరియో: నైజీరియాకు చెందిన నలుగురు వలసదారులు 14 రోజులపాటు కార్గో షిప్ అడుగున ముందుభాగంలో ఉండే చుక్కానిపై కూర్చుని  అత్యంత సాహసంతో కూడుకున్న యాత్ర చేసి బ్రెజిల్ చేరుకున్నారు. తిండి లేకుండా దీనావస్థలో ఉన్న వారిని ఆగ్నేయ పోర్టులోని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కనుగొని రక్షించారు. 

యూరప్ చేరుకోవాలన్న తపనతో నలుగురు నైజీరియా వలసదారులు అక్రమంగా ఒక పెద్ద ఓడ చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపుగా కదిలిన ఆ ఓడ యూరప్ వెళ్తుందనుకుంటే అదికాస్తా బ్రెజిల్ వైపుగా కదిలింది. నడిసంద్రంలో ఉన్నంతసేపు వారు ఎక్కడికి వెళ్తోంది కూడా వారికి తెలియదు. రేయింబవళ్లు ఆ చిన్న స్థలంలో ఇరుక్కుని అలా కూర్చుండిపోయారు. వారివద్ద తినడానికి కూడా ఏమీ లేదు. అలాగే బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించారు. 

ఆ ఓడ 14 రోజులపాటు మహాసముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించి బ్రెజిల్ పోర్టు చేరుకుంది. ఓడ బ్రెజిల్ చేరుకున్నాక దయనీయ స్థితిలో చుక్కానిపై  కూర్చుని ఉన్న నలుగురిని అక్కడి అధికారులు జాగ్రత్తగా కిందికి దించారు. వారి పరిస్థితి చూసి వెంటనే వారికి ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. మొత్తం నలుగురు వలసదారుల్లో ఇద్దరి అభ్యర్ధన మేరకు వారిని తిరిగి నైజీరియా పంపించగా మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్లోనే ఉండిపోయారు. 

వారు తమ అనుభవాలను పంచుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం చాలా భయంకరమైన అనుభూతి. ఒక్కోసారి పెద్ద పెద్ద తిమింగలాలు మాకు దగ్గరగా వెళ్తూ కనిపించేవి. వాటిని చూస్తేనే భయమేసేది. ఒకపక్క సముద్రం మరోపక్క ఓడ ఇంజిన్ శబ్దం హోరెత్తించడంతో నిద్ర కరువైంది. దాహానికి మాత్రం అపుడప్పుడు వేరే మార్గంలేక సముద్రం నీళ్లనే తాగేవాళ్ళం. ఓడ సిబ్బంది కంటపడితే వారు మమ్మల్ని సముద్రంలోకి పడదోస్తారని భయపడి అలాగే ఉండిపోయాము. 

ఒక్కోసారి మాలో ఎవరైనా కూడా ఆ పని చేస్తారేమోనని భయపడి కళ్ళు తెరచుకుని ఉండే వాళ్ళమన్నాడు. నైజీరియాలో ఆర్ధిక, రాజకీయ అస్థిరత వల్లనే తాము వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నాడు.  సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన చోట ఒక వ్యక్తి మాట్లాడుతూ మేము చాలా మంది వలసదారుల గాధలు విన్నాం కానీ ఇటువంటి సాహస యాత్రను నేనెన్నడూ చూడలేదని అన్నారు.    

ఇది కూడా చదవండి: సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)