Breaking News

‘స్పేస్‌’లో ఇళ్లకు రిహార్సల్‌గా భూమిపై త్రీడీ ప్రింటింగ్‌  హోటల్‌

Published on Sat, 04/08/2023 - 02:59

ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇలా ఎన్నోకావాలి. మరి భవిష్యత్తులో చందమామపైకో, అంగారకుడిపైకో వెళ్లినప్పుడు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఎలా? దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తున్న సమాధానం.. ‘త్రీడీ ప్రింటింగ్‌’ ఇళ్లు. కేవలం చెప్పడమే కాదు! చంద్రుడు, అంగారకుడిపై ఇళ్లు కట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందమూ కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఇందుకు రిహార్సల్‌గా.. భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో విశాలమైన హోటల్‌ను కట్టేందుకు రెడీ అయింది. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? 
భవిష్యత్తుకు   బాటలు వేసేలా.. 
మున్ముందు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మనుషులు అక్కడ జీవించేందుకు వీలుగా.. అక్కడి మట్టితోనే ఇళ్లు కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్‌లో పేరెన్నికగన్న కంపెనీ ‘ఐకాన్‌’తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఐకాన్‌ సంస్థ తొలుత ప్రయోగాత్మకంగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించి పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎడారిలో ఉన్న మర్ఫా పట్టణ శివార్లలో 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్‌ భవనాలు, గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది.
ఏమిటీ హోటల్‌ ప్రత్యేకతలు? 
► ఈ హోటల్‌లో త్రీడీ విధానంలో ప్రింట్‌ చేసే కొన్ని భవనాలు, దూరం దూరంగా కొన్ని ఇళ్లు, ఒక స్విమ్మింగ్‌ పూల్, స్పా, ఆరుబయ­ట సేద తీరేందుకు పలు ఏర్పాట్లు ఉంటాయి. 
► దూరం దూరంగా నిర్మించే ఇళ్లకు ‘సండే హోమ్స్‌’గా పేరుపెట్టారు. రెండు నుంచి నాలుగు బెడ్రూమ్‌లు, బాత్రూమ్‌లతో ఆ ఇళ్లు ఉంటాయి. 
► గుండ్రటి నిర్మాణాలు, డోమ్‌లు, ఆర్చీల డిజైన్లతో ఇళ్లు, భవనాలు ఉంటాయి. గదుల్లో బెడ్‌లు, టేబుల్స్‌ వంటి కొంత ఫర్నిచర్‌ను కూ­డా త్రీడీ విధానంలోనే ప్రింట్‌ చేయనున్నారు.  
► చుట్టూ ఉన్న ఎడారి వాతావరణంలో కలిసిపో­యేలా ఈ నిర్మాణాలకు రంగులను నిర్దేశించారు. 
► ఎడారిలో క్యాంపింగ్‌ సైట్‌గా ఉన్న ప్రాంతంలో ప్రింట్‌ చేస్తున్న ఈ హోటల్‌కు ‘ఎల్‌ కాస్మికో’గా పేరు పెట్టారు. ఇలాంటి త్రీడీ ప్రింటెడ్‌ హోటల్‌ ప్రపంచంలో ఇదే మొదటిది కానుందని చెప్తున్నారు. 
► ప్రఖ్యాత ఆర్కిటెక్చర్‌ కంపెనీ ‘బిగ్‌ (బ్జర్కే ఇంగెల్స్‌ గ్రూప్‌)’ దీనికి డిజైన్లు రూపొందించగా.. ఐకాన్‌ సంస్థ త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మాణాలు చేపట్టనుంది. 

ఇక్కడ చేసి.. చూపించి..
‘‘చంద్రుడు, మార్స్‌పై మొట్టమొదటి నివాసాలు కట్టేందుకు మా సంస్థ నాసాతో కలసి పనిచేస్తోంది. వాటికి రిహార్సల్‌గా అక్కడి ప్రాంతాలను పోలినట్టుగా భూమ్మీద ఉన్న ఎడారిలో త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించబోతున్నాం. కేవలం మట్టిని వాడి ఇళ్లను నిర్మించిన పురాతన మూలసూత్రాలను, ప్రస్తుత అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీని వినియోగించి.. అద్భుతమైన నిర్మాణాలను రూపొందించనున్నాం..’’ 
– ‘ఐకాన్‌’ సహ వ్యవస్థాపకుడు జేసన్‌ బల్లార్డ్, హోటల్‌ యజమాని లిజ్‌ లాంబర్ట్‌
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)