Breaking News

32 మంది మృతి.. వందల మందికి గాయాలు

Published on Mon, 06/08/2026 - 16:24

మనీలా: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం సమీపంలో ఈ రోజు సోమవారం ఉదయం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ  32 మంది మరణించారు. 200కు పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు ప్రకటించారు.

దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 17 మంది మరణించారని, గ్లాన్ అనే పర్వత ప్రాంత పట్టణంలో 13 మంది గ్రామస్థులు మరణించారని తెలిపారు. కాగా ఈ రోజు ఉదయం ఫిలిప్పీన్స్‌లో తీవ్ర స్థాయిలో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై 8.2 తీవ్రతతో భూకంపం నమోదైంది.  

భూకంపం వచ్చిన వెంటనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల్లో సుమారు 3 అడుగుల (1 మీటరు) ఎత్తులో అలలు ఎగిసిపడటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దీంతో వేలాదిగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

భయంతో పరుగులు తీసిన ప్రజలు
భూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్‌ సాంటోస్‌ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్‌, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)