అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు
Published on Mon, 03/29/2021 - 16:26
దక్షిణ కొరియాలో 24 ఏళ్ల ఒక కుర్రాడు ఇంట్లో నుంచే గేమ్స్ ఆడటం ద్వారా ప్రతి నెలా రూ.36 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అంటే ఏడాదికి సుమారు 4.32 కోట్లు. ఇంత మొత్తాన్ని బ్యాంక్ లేదా కంపెనీ ఎండి కూడా సంపాదించలేరు. కానీ ఈ యువకుడు కంప్యూటర్‌లో గేమ్స్ ఆడటం ద్వారా చాలా సంపాదిస్తున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్-క్యో ఆ దేశ రాజధాని సియోల్‌లోని తన అపార్ట్‌మెంట్ పైన ఏర్పరుచుకున్న ఒక రూమ్‌లో కూర్చుని రోజుకు 15 గంటలు వీడియో గేమ్స్ ఆడుతాడు. ఇలా యూట్యూబ్ లో ఆ గేమ్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా ప్రతి నెల 50,000 డాలర్లు సంపాదిస్తున్నాడు. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.36 లక్షలకు సమానం.
చాలా మంది కిమ్ అభిమానులు ఆటను ప్రత్యక్షంగా చూస్తారు. తన అభిమానులను అలరించడానికి మధ్య, మధ్యలో ఫన్నీ కామెంట్స్ చేస్తాడు. దక్షిణ కొరియాలో ఇటువంటి ప్రత్యక్ష ప్రసారాలు చేసే వారిని బ్రాడ్ కాస్టింగ్ జాకీలు లేదా బిజెలు అని కూడా పిలుస్తారు. దక్షిణ కొరియాలో అత్యధికంగా సంపాదించే వారిలో టాప్ 1 శాతం మందిలో కిమ్ కూడా ఉన్నారు. కానీ, అతని జీవన విధానం గొప్పగా లేదు అని చెప్పుకోవాలి. ఎప్పుడు అదే గదిలో ఉండటం వల్ల కొన్ని సార్లు అసౌకర్యానికి గురైనట్లు పేర్కొన్నారు. తినడం, నిద్రపోవడం అన్ని ఆ స్టోర్ రూమ్‌లోనే జరుగుతున్నాయి.
Kim Min-kyo plays #VideoGames for up to 15 hours a day — and makes a fortune from the thousands of fans watching him. https://t.co/eC3zfAsbdR #Livestreamer #Millionaire #Socialmedia
— Digital Journal (@digitaljournal) March 26, 2021
4,00,000 మందికి పైగా చందాదారులను కలిగి ఉన్న అతను ఇతర వనరుల ద్వారా కూడా సంపాదిస్తాడు. ప్రకటనలు, స్పాన్సర్‌షిప్, అభిమానుల విరాళం లేదా లైవ్‌స్ట్రీమ్‌ల మధ్య ఎనర్జీ డ్రింక్స్ తాగడం ద్వారా యూట్యూబ్‌లో డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే తన వీడియోలను ఆఫ్రికా టీవీ, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా కూడా సంపాదిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది లైవ్ స్ట్రీమర్లకు వ్యాపారానికి మంచి డిమాండ్ ఏర్పడింది. లాక్ డౌన్ వల్ల దక్షిణ కొరియాతో సహా ప్రపంచ వ్యాప్త యూట్యూబ్ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దీనితో లైవ్ స్ట్రీమర్లు భారీగా డబ్బు సంపాదించారు.
చదవండి:
డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్
Tags : 1