ప్రపంచంలో 230 కోట్ల మందికి వంటగ్యాస్‌ లేదు 

Published on Wed, 06/07/2023 - 04:19

ఐక్యరాజ్యసమితి: నేటి ఆధునిక యుగంలోనూ విద్యుత్‌ వెలుగులు చూడనివారు,  వంటగ్యాస్‌ అందుబాటులో లేనివారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ సంస్థలు.. ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎజెన్సీ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా ఒక నివేదిక విడుదల చేశాయి.

ప్రపంచంలో దాదాపు 230 కోట్ల మంది వంటచెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేదని తెలియజేశాయి.   

♦ 2030 నాటికి కరెంటు లేని వారి సంఖ్య 66 కోట్లకు, వంట గ్యాస్‌ లేని వారి సంఖ్య 190 కోట్లకు తగ్గిపోతుంది.   
♦  2010లో ప్రపంచంలో 84 శాతం మందికి విద్యుత్‌ సౌకర్యం ఉంది. 2021 నాటికి ఇది 91 శాతానికి చేరింది. కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి వల్ల 2019–21లో ఈ వృద్ది కొంత మందగించింది.   
♦  కరెంటు సౌకర్యం లేనివారిలో 80 శాతం మంది (56.7 కోట్లు) సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలో నివసిస్తున్నారు.  
♦ ఇంధన వనరుల విషయంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.   
♦ వంట గ్యాస్‌ లేకపోవడంతో కట్టెలు, పిడకలు వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం, దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతిఏటా దాదాపు 32 లక్షల మంది చనిపోతున్నారని అంచనా.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)