Breaking News

రైలుపై పడిన భారీ క్రేన్‌ 

Published on Wed, 01/14/2026 - 10:43

నఖోన్‌ రాచసీమ(థాయిలాండ్‌): థాయిలాండ్‌లో హైస్పీడ్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం తెప్పించిన భారీ క్రేన్‌ అటుగా వెళ్తున్న రైలు ప్రయాణికులకు పెనుశాపంగా పరిణమించింది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు మీద భారీ క్రేన్‌ పడటంతో బోగీలు పట్టాలు తప్పి, అగి్నకీలలు వ్యాపించిన ఘోర ప్రమాదంలో 31 మంది ప్రయాణికులుప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. 

విష యం తెల్సుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నంచేశారు. సహాయక సిబ్బంది వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. చైనా, ఆగ్నేయాసియా ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో ఈ హైస్పీడ్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. బ్యాంకాక్‌ నుంచి ఉమాన్‌ రాచసమీ ప్రావిన్స్‌కు బుధవారం ఉదయం బయల్దేరిన రైలుపై మార్గ మధ్యంలో నఖోన్‌ సిఖియో జిల్లా పరిధిలో భారీ క్రేన్‌ పడటంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న రైలుపై నిర్మాణరంగ క్రేన్‌ పడటంతో బోగీలు పట్టాలు తప్పి ధ్వంసమయ్యాయి. 

వెనువెంటనే బోగీల నుంచి మంటలు చెలరేగాయి. ఇంకా నలుగురి జాడ తెలియాల్సి ఉందని, బోగీల శిథిలాల కింద చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని నఖోన్‌ రాచసీమ గవర్నర్‌ అనుఫోంగ్‌ సుక్‌సోమ్నిత్‌ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు రైలులో 171 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రైలు పట్టాలకు ఇరువైపులా దూరంగా రెండు కాంక్రీట్‌ సపోర్ట్‌ పిల్లర్ల మీదుగా గిర్డర్‌లను ఏర్పాటుచేయగా వాటిపై వినియోగిస్తున్న భారీ నిర్మాణరంగ క్రేన్‌ అదుపుతప్పి ఈ రైలుపై పడిందని అక్కడి అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు రవాణా శాఖ మంత్రి ఫిఫాట్‌ రాచకిత్‌ప్రకరణ్‌ చెప్పారు.
 

#

Tags : 1

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)