Breaking News

తాడు కట్టకుండా తోసేశారు

Published on Mon, 06/15/2026 - 01:54

సావో పావ్‌లో(బ్రెజిల్‌): అంతెత్తు నుంచి స్వేచ్ఛగా కిందకు పడిపోతూ ఆఖరి నిమిషంలో మళ్లీ తాడు సాయంతో పైకి ఎగసిపడే సాహసక్రీడ ‘బంగీ జంప్‌’అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడతారు. తానూ ఓసారి బంగీ జంప్‌ చేసి సాహసం పూర్తిచేద్దామనుకున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. బంగీ జంప్‌ నిర్వాహకుల దారుణమైన నిర్లక్ష్యం కారణంగా ఆమె నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జంప్‌ చేసే వాళ్లకు ఏకైక ప్రాణాధారమైన తాడును ఆమెకు కట్టడం మర్చిపోయి అలాగే తోసేసి చివరకు ప్రాణాలుతోడేశారు.

బ్రెజిల్‌లోని సావో పావ్‌లో రాష్ట్రంలోని లైమేరియా నగర పరిధిలోని ప్రఖ్యాత స్కెలెటన్‌ వంతెన మీద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మారియా ఎడ్యువార్డా రోడ్రిగిస్‌ డీ ఫ్రిటాస్‌ అనే 21 ఏళ్ల అమ్మాయి శనివారం స్కెలెటన్‌ వంతెన వద్దకు బంగీజంప్‌ చేసేందుకు వచ్చింది. టికెట్‌ కొని సంబంధిత మణికట్టు బ్యాండ్‌ ఫొటోలను తన ‘ఇన్‌స్టా గ్రామ్‌’ఖాతాలో పోస్ట్‌చేసింది. ‘‘130 అడుగుల లోతున్న లోయలోకి అందరూ దూకుతున్నారు. నువ్వు కూడా దూకాలా ? అని ఒకరు అడిగారు. అయినా సరే దూకేస్తా’’అని ఘటనకు కొన్ని సెకన్ల ముందు తన ఖాతాలో ఆమె ఒక పోస్ట్‌చేశారు.

తర్వాత బంగీజంప్‌ సాహసక్రీడను నిర్వహించే ఒక ప్రైవేట్‌ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈమెను తమ చేతులతో పైకెత్తి వంతెన మీద నుంచి అమాంతం లోయలోకి పడేశారు. అయితే ఇదంతా దూరం నుంచి చూస్తున్న కొందరు హఠాత్తుగా అరవడం మొదలెట్టారు. ‘‘ఆమెకు సేఫ్టీ తాడును కట్టలేదు. కాపాడండి’’అని అరవడం మొదలెట్టారు. దీంతో నిర్వాహకులు హతాశులయ్యారు.

వెంటనే సహాయక సిబ్బంది వంతెన కిందకు దిగి అప్పటికే కిందపడిపోయిన అమ్మాయిని హుటాహుటిన సమీప లీగల్‌ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పుడు ఆ యువతి ప్రియుడు సైతం అక్కడే ఉన్నాడు. ఆమె ఎలాంటి రక్షణలేకుండా పడిపోవడం చూసి అతను స్పృహతప్పాడు. సేఫ్టీ తాడును ఆమెకు కట్టని ఘటనలో ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంగీజంప్‌ క్రీడ నిర్వహణలో ఏమేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారో తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనతో నగర మేయర్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)