Breaking News

గాజాలో 20 మంది పాలస్తీనియన్లు మృతి

Published on Wed, 08/28/2024 - 06:05

జెరూసలేం: గాజాపై మంగళవారం ఇజ్రాయెల్‌ దాడిల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌యూనిస్,  డెయిల్‌ అల్‌ బలాహ్‌పై జరిగిన ఈ దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులున్నట్లు చెప్పారు. టుల్కారెమ్‌లోని నూర్‌షామ్స్‌ శరణార్థి శిబిరంపై దాడుల్లో ఐదుగురు చనిపోయారు. ఇజ్రాయెల్‌ ఆంక్షలతో గాజాలో 10 లక్షల మందికి నెల రోజులుగా కనీస సాయం కూడా అందడం లేదని ఐరాస తెలిపింది.

హమాస్‌ చెర నుంచి బందీని కాపాడిన ఆర్మీ
హమాస్‌ చెరలో ఉన్న తమ పౌరుడిని మంగళవారం ఇజ్రాయెల్‌ ఆర్మీ కాపాడింది. గతేడాది అక్టోబర్‌ ఏడున గాజా సరిహద్దుల సమీపంలోని ఇజ్రాయెల్‌ భూభాగంపై హమాస్‌ మిలిటెంట్లు దాడి చేసి 1,200 మందిని చంపడం, 250 మందిని బందీలుగా పట్టుకోవడం తెలిసిందే. వారిలో క్వాయిద్‌ ఫర్హాన్‌ అల్‌కాదీ(52) అనే వ్యక్తిని గాజా కాపాడినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. హమాస్‌ చెర నుంచి ఇజ్రాయెల్‌ ఇప్పటి వరకు 8 మందిని కాపాడింది. ఇంకా 110 మంది బందీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు. 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)