Breaking News

కృష్ణ ‘చక్రం’

Published on Mon, 10/02/2023 - 05:14

కృష్ణ బిలాల అధ్యయనంలో కీలక మలుపు. గెలాక్సీ ఎం87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూచక్రం మాదిరిగా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యా నక్షత్ర రాశిలో ఉంది. దీనికి సంబంధించి రెండు దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన మీదట సైంటిస్టులకు ఈ విశేషం చిక్కింది. అందులో భాగంగా ఈ కృష్ణబిలానికి సంబంధించి నాలుగేళ్ల క్రితం ఈవెంట్‌ హోరైజాన్‌ టెలీస్కోప్‌ తీసిన ఫొటోను అధ్యయనం చేసి, అది నిలువుగానూ, పక్కలకూ గిరగిరా తిరుగుతోందని తేల్చారు. ఇలా తేలడం ఇదే మొదటిసారి. కృష్ణ బిలాల అధ్యయనంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

► కృష్ణ బిలం సమీపానికి వచి్చన ప్రతి వస్తూ రాశినీ దాని తాలూకు డిస్క్‌ లోనికి లాక్కునే క్రమంలో ఇలా తిరుగుతోందట.
► ఇది అచ్చం సౌర వ్యవస్థలోని గురుత్వాకర్షణ బలాల కలయిక తదితరాల ప్రభావంతో భూమి భ్రమణం, పరిభ్రమణం చేస్తున్న తీరును పోలి ఉందట.
► ఈ సరికొత్త సమాచారం చాలా థ్రిల్లింగ్‌ గా ఉందని దీనిపై సమరి్పంచిన అధ్యయన పత్రానికి లీడ్‌ గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ యుజూ కుయ్‌ చెప్పుకొచ్చారు.
► ప్రపంచవ్యాప్తంగా 45 అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులతో కూడిన బృందం నాలుగేళ్ల పాటు ఈ అంశంపై లోతుగా పరిశోధించింది.

తెలిసింది గోరంతే
► అత్యంత భారీగా ఉండే కృష్ణబిలాల అధ్యయనం చాలా కష్టం.
► ఎందుకంటే అవి కాంతితో సహా అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి.
► వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న సమాచారం కూడా చాలా స్వల్పం.


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)