Breaking News

పదేళ్ల బాలుడిని రక్షించిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్‌

Published on Wed, 07/29/2026 - 06:08

కాలిఫోర్నియా: బీచ్‌లో ఎత్తైన అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయిన పదేళ్ల బాలుడిని 16 ఏళ్ల లైఫ్‌గార్డ్‌ రక్షించాడు. ఆ యువకుడి ధైర్యానికి ఎరిక్‌ ట్రంప్‌ సహా ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. కాలిఫోర్నియాలో ఉన్న శాంటాక్రూజ్‌లోని సీబ్రైట్‌ బీచ్‌లో శనివారం నాడు శక్తివంతమైన అలలు ఎగసిపడ్డాయి. అసాధారణమైన ఈ అలలు బీచ్‌కు వచ్చిన వారిని ఆశ్చర్యం, ఆందోళనకు గురి చేశాయి. విరుచుకుపడిన అలల తాకిడికి పదేళ్ల వయస్సున్న బాలుడు కొట్టుకుపోయాడు. ఉధృతమైన అలలతో పోరాడుతూ కనిపించాడు.ఒడ్డున ఉన్నవారు ఏం ఘోరం జరుగుతుందోనని భయపుడుతూ చూశారు.

ఇది చూసిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్‌ కొన్ని క్షణాల్లో రంగంలోకి దిగాడు. కల్లోలంగా ఉన్న సముద్రంలోకి దూకి, ఉధృతంగా ఉన్న అలలను ఎదుర్కొంటూ నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని చేరుకున్నాడు. అలలతో పోరాడుతూ, చివరికి ఆ బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఉత్కంఠభరితమైన రెస్క్యూ ఆపరేషన్‌ను బీచ్‌లో ఉన్న వ్యక్తులు చిత్రీకరించారు. ఈ ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రమాదకరమైన పరిస్థితిలో లైఫ్‌గార్డ్‌ చూపిన ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రశంసించారు. ఈ వీడియోపై ఎరిక్‌ ట్రంప్‌ కూడా స్పందించారు. రక్షించిన యువకుడిని ప్రశంసించారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)