Breaking News

కీవ్‌పై రష్యా దాడులు

Published on Wed, 06/18/2025 - 04:52

కీవ్‌: నెలల తరబడి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యా సోమవారం రాత్రివేళ ముప్పేట దాడికి దిగింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులను ఉధృతంచేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌పై కన్నెర్రజేసింది. రాత్రంగా పలుచోట్ల జరిగిన క్షిపణి దాడుల్లో 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని కీవ్‌ నగర సైనిక పరిపాలన అధిపతి తైమూర్‌ త్కచెన్కో మంగళవారం ప్రకటించారు. ఈ దాడుల్లో 156 మంది గాయపడ్డారు. క్షిపణి దాడుల ధాటికి 9 అంతస్తుల భవనం ఒకటి నేలమట్టమైంది. మరికొన్ని అపార్ట్‌మెంట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.

ఉక్రెయిన్‌ రాజధానిపై ఇటీవలికాలంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటని తైమూర్‌ పేర్కొన్నారు. యుద్ధం మొదలై మూడు సంవత్సరాలు గడిచినా, రెండుసార్లు ప్రత్యక్ష చర్చలు జరిగినా ఈ రణం రవ్వంతైనా సానుకూల, శాంతిపథం దిశగా సాగట్లేదని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేవలం సైనికుల పరస్పర మార్పిడి, బందీల విడుదల వంటి కంటితుడుపు చర్చలు తప్పితే కీలకమైన కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడట్లేదు. తీరప్రాంత నగరం ఒడెసాపైనా రష్యా డ్రోన్‌ దాడులు జరిపింది. ఈ దాడిలో ఒకరు చనిపోయారు. 17 మంది గా యపడ్డారు. సోమవారం రాత్రి రష్యా ఏకంగా 440 డ్రోన్లు, 32 మిస్సైళ్లను కీవ్‌పై ప్రయోగించిందని జెలెన్‌స్కీ చెప్పారు.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)