Breaking News

అంగట్లోకి ఇంటిగుట్టు

Published on Mon, 12/01/2025 - 19:44

దక్షిణకొరియాలో  భారీ సైబర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. 1,20,000 సీసీ కెమెరాలు హ్యాక్ చేసి వాటి ద్వారా రహస్య సమాచారం సేకరిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్యారా ప్రజలు వ్యక్తిగత వీడియోలను నిందితులు సేకరించేవారని వాటిని అమ్మి పెద్ద మెుత్తంలో డబ్బు సంపాదించేవారని తెలిపారు.

దక్షిణ కొరియాలో భారీ స్కామ్ బయిటపడింది. నివాస ప్రాంతాలతో పాటు పలు వ్యక్తిగత ప్రదేశాలలో భద్రత కోసం ఏర్పరుచుకున్న సీసీ కెమెరాలను సైబర్ ముఠా హ్యాక్ చేశారు. అనంతరం ఆ కెమెరాల ద్వారా బాధితుల వ్యక్తిగత వీడియోలను సేకరించి  ప్రైవేట్  వెబ్‌సైట్ లకు అమ్మేవారు. దీనికోసం నిందితులు, నివాస గృహాలు, ఆసుపత్రులు, లాడ్జ్ లు ఇతర ప్రాంతాలలో అమర్చిన సీసీ కెమెరాలనే టార్గెట్ చేసినట్లు  పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘటనపై సౌత్ కొరియా పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నిందితులని అదుపులోకి  తీసుకున్నామని వారిలో ఒకరు  63 వేల కెమెరాలను హ్యాక్ చేశాడని పోలీసులు తెలిపారు. దాని ద్వారా 545 వ్యక్తిగత వీడియోలను సేకరించి వివిధ వెబ్‌సైట్  లకు అమ్మాడన్నారు. దాని ద్వారా 35 మిలియన్లు సంపాదించారని తెలిపారు. మరోక వ్యక్తి 70 వేల కెమెరాలను హ్యాక్ చేసి 648 ప్రైవేట్ వీడియోలను అమ్మినట్లు తెలిపారు. ఇలా చేయడం ద్వారా నిందితులిద్దరూ పెద్ద మెుత్తంలో డబ్బు సంపాదించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అరెస్టైన నలుగురికి ఎటువంటి పరిచయం లేదన్నారు.

ప్రజల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేసిన వెబ్‌సైట్ లపై నిఘా ఉంచామని త్వరలోనే దానిలోని కంటెంట్ తొలగిస్తామని పోలీసులు తెలిపారు. వాటిని గుర్తించడానికి  ఫారెన్ ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నామన్నారు. నిందితులు సీసీ కెమెరాలు హ్యాక్ చేసిన ప్రదేశాలలో వారి కెమెరాలు హ్యాక్ అయినట్లు సమాచారమిచ్చామని పోలీసులు  పేర్కొన్నారు. బాధితులకు కెమెరా హ్యాక్ కాకుండా ఏలా జాగ్రత్త పడాలి, పాస్ వర్డ్ ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై అవగాహాన కల్పించినట్లు పేర్కొన్నారు.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)