Breaking News

రూ.1,000 కోట్ల పెయింటింగ్‌!

Published on Thu, 11/21/2024 - 07:59

బెల్జియం సర్రియలిస్ట్‌ ఆర్టిస్టు రెన్‌ మార్గిట్‌ చేతినుంచి జాలువారిన ఈ ప్రఖ్యాత పెయింటింగ్‌ వేలం రికార్డులను బద్దలు కొట్టింది. న్యూయార్క్‌లో క్రిస్టీస్‌ నిర్వహించిన తాజా వేలంలో ఏకంగా రూ.1,021 కోట్లు (12.1 కోట్ల డాలర్లు) పలికి సంచలనం సృష్టించింది. అధివాస్తవికతను చిత్రించే పెయింటింగుల్లో అత్యధిక ధర పలికిన రికార్డును సొంతం చేసుకుంది. 

దీనికి 9.5 కోట్ల డాలర్ల దాకా పలకవచ్చని నిర్వహకులు అంచనా వేస్తే వాటిని కూడా అధిగమించేసింది! 1954కు చెందిన ఈ పెయింటింగ్‌ అధివాస్తవికతకు సంబంధించి అత్యుత్తమ వ్యక్తీకరణగా విమర్శకుల ప్రశంసలు పొందింది. మార్గిట్‌ వేసిన 27 ప్రఖ్యాత పెయింటింగ్‌ల కలెక్షన్‌ ‘ద ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌’లో దీన్ని మణిపూసగా చెబుతారు.

వీధి దీపపు వెలుగుల్లో ఇల్లు, దీపంతో సహా నీటిలో దాని ప్రతిబింబం, ముందూ వెనకా చెట్లు, పైన నీలాకాశం, తెల్లని మబ్బులతో చూసేందుకు సాదాసీదాగా కన్పించే ఈ పెయింటింగ్‌ వాస్తవానికి అత్యున్నత స్థాయి మారి్మకతకు అద్దం పడుతుందని కళాప్రియులు చెబుతారు. మార్గిట్‌ వేసిన మరో రెండు పెయింటింగులు కూడా కోటి, 37 లక్షల డాలర్ల చొప్పున అమ్ముడయ్యాయి. 
 

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)