మీదీ బిలియనీర్‌ మైండే!

Published on Sat, 11/29/2025 - 07:50

బిలియనీర్‌ల మెదడుకు, మామూలు వ్యక్తుల మెదడుకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవటానికి డాక్టర్‌ శ్వేతను చేసిన ఇంటర్వ్యూ ఇది. శ్వేత ప్రధానంగా ‘న్యూరో ప్లాస్టిసిటీ’ (మెదడుకు ఉండే ‘తర్ఫీదుకు మార గల’ సామర్థ్యం) గురించి మాట్లాడారు. సగటు మనిషికి భిన్నంగా ‘సంపన్న’ ఆలోచనలు కలిగిన బిలియనీర్‌లో ‘ఫ్రంటల్‌ కార్టెక్స్‌’ శక్తిమంతంగా పని చేస్తుందన్నారు. మెదడుకు తర్ఫీదు ఇవ్వగలిగితే ఎవరైనా బిలియనీర్లు కావచ్చంటారు. ఆమె మాటల్లోని ముఖ్యాంశాలు:

స్ట్రాటెజిక్‌ మార్నింగ్‌ రొటీన్‌
‘‘ఉదయం మేల్కొన్నాక, తొలి గంట ఎంతో అమూల్య మైనది. ‘గోల్డ్‌’ అంటాను ఆ గంటను నేను. ఆ రోజంతా మనం ఎలా ఉండబోతున్నాం అన్నది ఆ ‘గోల్డెన్‌ అవరే’ నిర్ణయిస్తుంది. ఆ గోల్డెన్‌ అవర్‌ ఎలా ఉండాలన్నది మాత్రం మనం నిర్ణయించగలగాలి. ఉదా: ఉదయం లేవగానే మీరు ఒక గంట వరకు ఫోన్‌ను చేతుల్లోకి తీసు కోకండి. తీసుకుంటే ఏమౌతుందంటే, మీ మెదడు ప్రతి చర్యాశీలకమైన (రియాక్టివ్‌) ‘బీటా వేస్‌’ స్థితిలోకి వెళ్లి పోతుంది. అలా కాకుండా... తీటా, ఆల్ఫా వంటి శాంతియుతమైన తరంగ స్థితుల్లోకి మీరు ఉద్దేశపూర్వ కంగా వెళ్లిపోవాలి. ఫోన్‌ను మీరు టచ్‌ చేయకుండా, ఉషోదయ కిరణాలను కాసేపు మిమ్మల్ని టచ్‌ చేయ నివ్వండి. మెదడులో ఉండే హైపోథాలమస్‌లోని చిన్న కేంద్రకాల జతలు క్రియాత్మకమై, మీ జీవ గడియా రాన్ని లయబద్ధం చేస్తాయి. దీనినే ‘స్ట్రాటెజిక్‌ మార్నింగ్‌ రొటీన్‌’ అంటాం.

లక్ష్యానికి మేల్కొలుపు ‘మూవర్స్‌’
‘‘స్ట్రాటెజిక్‌ మార్నింగ్‌ రొటీన్‌ను పాటించటానికి ‘మూవర్స్‌’ అనే ఒక సరళమైన సూత్రాన్ని మేము వృద్ధి చేశాం. మూవర్స్‌ అనే సంక్షిప్త నామంలోని 6 ఇంగ్లిష్‌ లెటర్స్‌లో ఒక్కో లెటర్‌కు ఒక్కో అర్థం ఉంది. ఎం–మెడి టేషన్, ఒ–ఆక్సిజనేషన్, వి–విజువలైజేషన్, ఇ–ఎక్సర్‌ సైజ్, ఆర్‌–రీడింగ్, ఎస్‌–స్క్రైబింగ్‌. ధ్యానం, శ్వాస, మనోవీక్షణ, వ్యాయామం, చదవటం, రాయటం అనే ఈ ఆరు సాధనలలో ప్రతి దానికీ కనీసం ఐదు నిము షాలు కేటాయించాలి. అవన్నీ కూడా అంతిమంగా మెద డును చురుకెత్తించేవే. మొత్తంగా మూవర్స్‌ అనే ఈ మెళుకువ మీలో ఒక లక్ష్యం ఏర్పరచి, ఆ లక్ష్య సాధనకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.

‘ఫ్రంటల్‌ కార్టెక్స్‌’దే కీలకమంతా!
‘‘మెదడు ముందు భాగంలో ఉండే ‘ఫ్రంటల్‌ కార్టెక్స్‌’ తార్కికమైన ఆలోచనను జనింపజేస్తుంది. భావోద్వేగా లను అదుపు చేస్తుంది. వ్యసనాలను నియంత్రిస్తుంది. ఇందుకు భిన్నంగా మెదడు మధ్యభాగంలో ఉండే‘లింబిక్‌ సిస్టమ్‌’ వాయిదా మనస్తత్వానికీ, ఒత్తిళ్లకూ కారణం అవుతుంది. మామూలు మనుషుల్లో లింబిక్‌ సిస్టమ్‌ పైచేయిగా ఉంటే, బిలియనీర్‌లలో ఫ్రంటల్‌ కార్టెక్స్‌ బలంగా ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. ‘మూవర్స్‌’ టెక్కిక్‌ లింబిక్‌ సిస్టమ్‌ను మందగింపజేసి, ఫ్రంటల్‌ కార్టెక్స్‌ను క్రియాశీలం చేస్తుంది. దాంతో బిలి యనీర్స్‌ లేదా ‘హై–పెర్ఫార్మర్‌’ల ఫ్రంటల్‌ కార్టెక్స్‌ శక్తి పుంజుకుని,  తద్వారా ఒక  భావోద్వేగ నిర్లిప్తత అలవడు తుంది. ప్రాక్టికల్‌గా మారిపోతారు.

పుట్టుకురారు... తయారౌతారు
‘‘చివరికి, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ‘బిలియనీర్‌ మెదడు’ అనేది జన్యువుల లాటరీలో తగిలిన సంపద కాదు. క్రమం తప్పని, స్వల్పమైనవైన, సోమరితనంతో వాయిదా వేయని దినచర్యల ‘సాగు ఫలితం’. ఐదు నిమిషాల రోజువారీ నిశ్శబ్ద ధ్యానం, క్రమబద్ధం చేసు కున్న ఉదయపు వేళ అలవాట్లు, 4–7–8 వంటి శ్వాస వ్యాయామాలు (ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు గాలిని గుండెల్లోకి పీల్చటం, 7 సెకన్ల పాటు శ్వాసను పట్టి ఉంచటం, 8 సెకన్ల పాటు గాలిని నోటి ద్వారా బయటికి వదలటం) మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. బిలియ నీర్లు పుట్టుకురారు. తయారౌతారు. బికారులు కూడా సాధనతో, స్థితిగతుల నియంత్రణతో బిలియనీర్లుగా ఎదగవచ్చు. కీలకమంతా మెదడుకు తర్ఫీదు ఇవ్వటంలోనే ఉంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ ఏ వయసులోని వారికైనా సాధ్యమే!
-ఎడిటోరియల్‌ టీమ్‌

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)