Breaking News

‘కులనాగు’తో.. విషం చిమ్మించటం సబబేనా?

Published on Fri, 01/24/2025 - 17:29

పల్లెపట్టు శ్రమైక జీవన సౌందర్యాన్ని, సంస్కృతిని రక్తనిష్ఠ మొనర్చుకున్న జానపద కవి బ్రహ్మ కొసరాజు రాఘవయ్య. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, (Harikatha) జముకుల కథలు, బుర్రకథలు, భజన గీతాలు, పగటి వేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, గంగిరెద్దుల గీతాలు... ఇలా అట్టడుగు వర్గాల జీవితాలు ప్రతిబింబించే ఎన్నో పాటలు (Songs) రాశారు. ‘ప్రతిభ ఉన్నా దానికి పదును పెట్టేవారు, ప్రోత్సహించేవారు లేకపోతే ఏం ఉపయోగం?’ అనేవారు ఆయన తనను ఆ స్థాయికి ప్రోత్సహించిన వారిని తలుచుకుంటూ.

కొసరాజు రాఘవయ్య (Kosaraju Raghavaiah) నాలుగో తరగతి వరకు చదివారు. పైచదువులకు వెళ్లలేకపోయారు. అదృష్టవశాత్తు ఆయన కొండముది నరసింహ పంతులు దృష్టిలో పడ్డారు. ఆయన శిష్యరికంలో రాటుతేలారు. ఆ తర్వాత కవిత్వం రాస్తూ, రైతులు, వివిధ జాన పదుల జీవితాలను అధ్యయనం చేశారు. తన పేరు చివర ఉన్న ‘చౌదరి’ తొలగించుకున్నారు. మొదటగా ‘రైతుబిడ్డ’ చిత్రానికి పాటలు రాసి ఆ తర్వాత ప్రోత్సాహం లేక మద్రాసు (Madras) నుంచి స్వగ్రామం వెళ్లిపోయి వ్యవసాయం చేసుకున్నారు. అయితే ఆయన కలం పదును గురించి కేవీ రెడ్డికి డీవీ నరసరాజు చెప్ప డంతో ఆయన్ని మద్రాసుకు పిలిపించి 1954లో విడుదలైన పెద్దమనుషుల చిత్రానికి పాటలు రాయించారు. 

ఆ విధంగా 13 ఏళ్ల తర్వాత రెడ్డిగారి ప్రోత్సాహంతో సినిమాలలో బిజీ కవి అయిపోయారు కొసరాజు. మొత్తం 350 చిత్రాలకు గాను 3 వేల పాటలు రాశారు. అటువంటి గొప్ప కవిని ఆ ఇంటి పేరు గలవారు  ‘కొసరాజు వారి వంశవృక్ష సేవా సమితి’ పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నిజానికి గొప్ప వ్యక్తులను స్మరించుకోవడానికి ఏ పేరుతో ఎవరు సమావేశాలు నిర్వహించినా హర్షణీయమే. అయితే ఆ సభల్లో ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలాంటి సభల్ని ‘సభాకల్పతరుర్భాతి’ అంటారు. ధర్మసభల్లో మాట్లాడవలసిన రీతిని, భారతంలో పూరునికి యయాతి బోధించే విధానం నన్నయ ఇలా చెప్తాడు:

‘మనమునకు ప్రియంబును, హితమును పద్యము దద్యమును నమోఘ మధురంబును, పరిమితమును నగు పలుకొనరగా పలుకునది ధర్మయుతముగా సభలన్‌. ధర్మయుతమైన సభల్లో మనం మాట్లాడే మాటలు తోటి వారికి ప్రియం కలిగించాలి. హితంగా, మితంగా, ఇంపుగా, ఎదుటివారు నొచ్చుకోని విధంగా, మెచ్చుకునే విధంగా ఉండాలి అంటాడు.

‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితంచయాత్‌ / స్వాధ్యాయభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే! ‘మాటలు ఉద్వేగం కలిగించనవి, ఆగ్రహం పుట్టించనవి, ప్రయోజనకరంగా ఉండేవి, వాక్‌ సంబంధమైన తపస్సు లాంటివి’ అని భగవద్గీత ప్రబోధిస్తోంది. కానీ జనవరి 19న విజయవాడలో నిర్వహించిన కొసరాజు స్మృతి సభలో జరిగిందేమిటి? ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడిందేమిటి?

విషతుల్యమైన మస్తిష్కంతో, ఛద్మ వేషధారణతో కనీసం సాహితీ పరిజ్ఞానం లేని కుల నాగులను పిలిపించి మాట్లాడితే ఏం జరుగుతుందో అదే ఆ సభలో జరిగింది. ఆ సభ ఔచిత్యం ఏమైపోయింది? చివరికి బాకా పత్రికల్లో సైతం విషవాక్యాలే వార్తగా వచ్చాయి తప్ప కొసరాజు గురించి కొసరు వార్త కూడా లేదు. కొసరాజు వంశస్థులు ఒక్కసారి ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక గొప్ప కవికి కుల పంకిలం అంటించడం నిజమైన నివాళి అవుతుందా? ఆ సభను తమ ఆక్రోశం, కుళ్ళు వెళ్ళబుచ్చుకోవడానికి, కుసంస్కార భాషను ఉపయోగించటం అంటే  సభ రభస అయినట్టు కాదా? ఇది కొసరాజుకి నివాళి అవుతుందా? రాజకీయ ప్రత్యర్థుల్ని తమ పోలీసు భాషతోనో, తమ కుల దురహంకార భాషతోనో తిట్టాలనుకుంటే డైరెక్ట్‌గా కులసభలే పెట్టుకోవచ్చు. కొసరాజు పేరు ఎందుకు?

చ‌ద‌వండి: కాంతి లేని కూటమి పాలన

నార్ల వెంకటేశ్వరరావు, దేవరకొండ బాలగంగాధర తిలక్, వాసిరెడ్డి సీతాదేవి, కొసరాజు రాఘవయ్య వంటి సాహితీ మూర్తులను కుల దృక్కోణం నుంచి చూడటం వారి సభలకు కులనాగులను పిలిపించి ఆ సభకు సంబంధం లేని వ్యక్తుల మీద విషం చిమ్మించటం సబబేనా? ఒక పరి ఆలోచించండి!

- పి. విజయబాబు 
సీనియర్‌ సంపాదకులు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)