Breaking News

నిబద్ధతను గుర్తించడమూ నిబద్ధతే!

Published on Mon, 01/27/2025 - 20:03

రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఆర్‌. వెంకట్రామన్, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌లు (APJ Abdul Kalam) ఆ స్థితికి చేరడానికి ఎంతటి అర్హులో చెప్పే అరుదైన సంఘటన ఇది. 1983లో అబ్దుల్‌ కలామ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)లో డైరెక్టర్‌గా విధులు నిర్వహించే రోజుల్లో  రక్షణ మంత్రిగా ఆర్‌. వెంకట్రామన్‌ (R. Venkataraman) ఉన్నారు. దేశ సంరక్షణ కోసం స్వదేశీ రీసెర్చ్‌ ద్వారా క్షిపణులు, ఉపగ్రహాల నిర్మాణం చేపట్టాలని భారత ప్రభుత్వం ‘మిస్సైల్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రాం కమిటీ’ని నియమించింది. ఇందులో కలామ్‌ అధ్యక్షునిగా, ఐదుగురు అనుభవజ్ఞులైన సైంటిస్టులు సభ్యులుగా ఉన్నారు. త్రివిధ దళాలకు ఉపయోగపడే క్షిపణులు, ఉపగ్రహాల నిర్మాణానికి కావలసిన బడ్జెట్‌ వివరాల నమూనా (బ్లూ ప్రింట్‌) తయారు చేసే బాధ్యత ఈ కమిటీకి అప్పజెప్పింది రక్షణ శాఖ. పలు చర్చలు, తర్జన భర్జనలు జరిపిన అనంతరం, కమిటీ పది సంవత్సరాల కాలవ్యవధి, రూ. 390 కోట్ల బడ్జెట్‌తో ఒక డ్రాఫ్ట్‌ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసింది.

రక్షణ మంత్రి, త్రివిధ దళాల ముఖ్య అధి కారుల సమావేశంలో కలామ్‌ తమ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ను వివరించారు. మంత్రి దశల వారీగా కాకుండా ‘సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం’ (ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిసైల్‌ ప్రోగాం)ను అతి తక్కువ సమయంలో తయారు చేసే పద్ధతిలో ప్లాన్‌ తీసుకురావలసిందిగా కోరారు. అది విని సైంటిస్టులు దీనికి కొంత వ్యవధి కావాలని కోరారు. ‘లేదు, లేదు; రేపు సాయంత్రం కేబినెట్‌ కమిటీ మీటింగు జరగబోతోంది, అందులో మీ ప్రాజెక్టు రిపోర్టు ఉంచాల్సి ఉంటుంది’ అని, మరుసటి రోజు ఉదయం తనను కలవాల్సిందిగా కోరారు వెంకట్రామన్‌. కలామ్‌, కమిటీ సభ్యులూ ఆఫీసు చేరుకుని ఆలస్యం చేయకుండా ఆ పనిలో రాత్రంతా తల మునకలయ్యారు. ఎప్పుడు తెల్ల వారిందో తెలీనేలేదు. మొత్తానికి మంత్రి కోరినట్టుగానే రిపోర్టు తయారు చేశారు.

ఉదయం ఇంటికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్‌ టేబిల్‌ దగ్గర కూర్చున్నాక గుర్తుకొచ్చింది కలామ్‌ గారికి, ఆరోజు జుమ్మేరాత్‌; ఆయన అన్న కూతురు జమీలాది ‘నిఖా’ అన్న సంగతి! అదీ ఢిల్లీలో కాదు, దక్షిణాది రామేశ్వరంలో! వృత్తి ఒత్తిడి రీత్యా కుటుంబ బాధ్యతలు విస్మరించడం ఎంతవరకు సబబు? ఇది ఆయన మనసును కలచి వేసింది. కాని ఇవ్వాళ, ఆమె పెళ్లికి తను హాజరు కాలేని నిస్సహాయ పరిస్థితి! బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తి చేసుకుని, తన టీమ్‌తో సౌత్‌ బ్లాక్‌ చేరుకుని, రాత్రి సవరించిన ప్రాజెక్టు రిపోర్టును మంత్రి వెంకట్రామన్‌కి చూపించారు డాక్టర్‌ కలామ్‌. 

దాన్ని సావధానంగా వీక్షించి తను సూచించిన విధంగానే తయారవటంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆయన, ‘ఇలాంటి క్లిష్టమైన జాబ్‌ మీతోనే సాధ్య పడుతుంది అనే నమ్మకంతోనే మిమ్మల్ని డీఆర్‌డీఓ డైరెక్టర్‌గా నియమించా కలామ్‌జీ’, అని నవ్వుతూ ఆయన భుజం తట్టి, ఇక వెళ్దాం అన్నట్టు కుర్చీలో నుండి లేచి నిలుచున్నారు వెంకట్రామన్‌. తోటి సభ్యులు ఛాంబర్‌ నుండి వెళ్ళే ముందు డాక్ట‌ర్‌ అరుణాచలం (టీం సభ్యుడు) మంత్రి గారితో, ‘ఇవ్వాళ సాయంత్రం రామేశ్వరంలో కలామ్‌ అన్నగారి అమ్మాయి పెళ్ళి’ అనటంతో, కలామ్‌ వైపు ఆశ్చర్యంగా నఖశిఖ పర్యంతం చూశారు మినిస్టర్‌. కాసేపటికి తేరుకుని, తన పర్సనల్‌ సెక్రటరీని పిలిచి అర్జంటు సూచనలు కొన్ని చేశారు. ఢిల్లీ విమానా శ్రయం నుండి మద్రాసుకు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ మరో గంటలో వెళ్లనుంది. కావలసిన బ్యాగేజ్‌తో రామేశ్వరం చేరుకోవటానికి వెంటనే ఎయిర్‌పోర్ట్‌ చేరుకోవలసిందిగా కలామ్‌కు చెప్పారు మంత్రి పీఏ. ఈసారి ఆశ్చర్యంలో మునగటం డాక్ట‌ర్‌ కలామ్‌ వంతైంది.

విమానం మద్రాసు రన్‌ వేపై దిగినవెంటనే ప్రక్కనే ఆయన కోసం వేచి ఉన్న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ హెలికాప్టర్‌ ఆయన్ని తీసుకుని మదురైకి బయలుదేరింది. అక్కడ ఎయిర్‌ఫోర్స్‌ కమాండెంటు తన వాహనంలో ఆయన్ని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. మదురైనుండి రామేశ్వరం బయల్దేరే ట్రెయిన్‌ను కలామ్‌ వచ్చే వరకు ఆపాలని, ఉదయమే రాష్ట్రపతి  కార్యాలయం నుండి మదురై రైల్వే డివిజనల్‌ సూపరింటెండెంట్‌కు సూచనలు అందాయి. అంతే... కలామ్‌ రావటంతో ఆయనను రిసీవ్‌ చేసుకుని ట్రెయిన్‌లో కూర్చో బెట్టారు రైల్వే ఉన్నత అధికారులు. 175 కి.మీ. దూరం రామేశ్వరం. 

చ‌ద‌వండి: డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పనీ చేశారు!

ఆ ట్రెయిన్‌ మూడు గంటల్లో గమ్యం చేరటంతో జమీలా పెళ్ళి ముహూర్తానికి చేరుకున్నారు కలామ్‌ సాబ్‌. అనుకోని ఆయన రాకతో ఆ కుటుంబంలో సంతోషం రెండింతలైంది. ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే ముందు, తన సహచరుడు డాక్ట‌ర్‌ అరుణాచలం ‘గత ఆరు నెలలుగా మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఇది’ అన్న మాటలు జ్ఞప్తికి వచ్చాయి కలామ్‌కు. ఎంతనిజం! తన వృత్తి పట్ల చూపిన నిబద్ధతకు రక్షణమంత్రి బహుశా ఇది తనకు ఇచ్చిన బహుమతి కాబోలు అనుకున్నారు కలామ్‌ సర్‌. తర్వాత కాలంలో వీరిద్దరూ రాష్ట్రపతి పీఠం అధిరోహించటం గమనార్హం!

- జిల్లా గోవర్ధన్‌ 
వ్యాసకర్త మాజీ పీఎఫ్‌ కమిషనర్, ముంబై 
(డాక్ట‌ర్‌ అబ్దుల్‌ కలామ్‌ ఆత్మ కథ ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ ఆధారంగా)
(జ‌న‌వ‌రి 27న‌ మాజీ రాష్ట్రపతి ఆర్‌. వెంకట్రామన్‌ వర్ధంతి)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)