Breaking News

రంగస్థల నాటకానికి రక్షాకంకణం

Published on Mon, 03/25/2024 - 01:09

సినీ’మాయే’ – విస్తృతమై, ‘నాటు నాటు’ అంటూ నాటుకుంటున్న ఈ కాలాన నీటుగా, ఉదాత్త విలువల దీటుగా – నాటకం పట్ల సమాజంలో కళాభిరుచులకు ఆస్కారంగా, ఆదరాభిమానాలు పాదుకు నేలా రంగస్థల నాటకానికి ప్రాపుగా ఒక కాపు కాస్తూ, కృషి చేస్తున్న సంస్థల్లో ఒకటి ‘రసరంజని’. జీవధార కళగా రంగస్థల నాట కాన్ని పరివ్యాప్తం చేస్తూ, సొంత రిపర్టరీ నిర్వహణతో బాటు – ఎన్నో నాటక సమా జాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తూ,  మూడు దశాబ్దాలుగా నాటక రంగాభి మానుల మన్ననలు అందుకుంటున్న సంస్థ రసరంజని. ‘వరల్డ్‌ థియేటర్‌ డే’ను మార్చి 27న జరుపుకొంటున్న సందర్భంగా రసరంజని 3 రోజులపాటు నాటకోత్సవాలు నిర్వహిస్తోంది.

పౌరాణిక నాటకాలు, చారిత్రకాలు, సాంఘిక నాటకాలు ఎన్నో సమాజాభివృద్ధిలో, సామాజిక చైతన్యంలో గణనీయమైన పాత్ర పోషించాయి. నాటక ప్రదర్శన అన గానే జనం ఒకప్పుడు తండోపతండాలుగా బండ్లు కట్టుకుని మరీ తరలి వెళ్లేవారు. ఆ రోజుల్లో సురభి వంటి నాటక సమాజాల కీర్తి సురభిళాలు పరివ్యాపితమై విరాజిల్లేవి.పాండవోద్యోగ విజయాలు, శ్రీకృష్ణరాయ బారం వంటి పద్యనాటకాల లగాయితు కన్యాశుల్కం, వరవిక్రయం, చిల్లర దేవుళ్ళు ఇలా చెప్పుకుంటూపోతే అంతులేని పట్టి కగా... జనాదరణ పొంది సమాజంపై ప్రభా వం చూపిన రంగస్థల నాటకాలు ఎన్నో. ఈ తరానికి వాటిని (ప్ర)దర్శింపచేయడంలో ‘రసరంజని’ పాత్ర అవిస్మరణీయం.

నాటక రంగ అభివృద్ధి కోసం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నాటకం విస్తృతంగా ప్రదర్శింపబడాలనీ, నాటకం ప్రజల మధ్యకి వెళ్లాలనీ, నాటకం ద్వారా సమాజ చైతన్యం జరగాలనీ ముఖ్యంగా ఎన్ని ఇక్కట్లున్నా టిక్కెట్టు కొని నాటకం చూడడం అనే ఉత్తమాభిరుచిని జనం విడనాడకూడదనే సంకల్పంతో నేటికీ రంగస్థల నాటక ప్రదర్శ నలకే కట్టుబడి 31 ఏళ్లుగా నెలనెలా రసరంజని నిర్వహిస్తున్న కార్యక్రమాలు నాటకరంగానికే తలమానికాలు.‘రసరంజని’ 1993 మార్చి 8న నెల కొల్పబడింది. ఈ మూడు దశాబ్దాల ప్రయా ణంలో దాదాపు 700 నాటకాలు, మూడు వేల అయిదువందల ప్రదర్శనలు – సంస్థ కళాకారులతోనే కాక అనేక నాటక సమా జాల వారితో ప్రదర్శించడమైంది. 

సొంత రిపర్టరీ నెలకొల్పడం ద్వారా ఎందరో నటీనటులకు, రచయితలకు, దర్శ కులకు, రంగస్థల సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చి, తద్వారా వారు నాటకరంగంలో స్థిరపడి వన్నెవాసికెక్కడానికి రసరంజని దోహదపడింది. రంగస్థలంపై రసరంజని కథానాటక సప్తాహాలు, కథానాటక శరన్న వరాత్రులు, తెలుగు హాస్య నాటకోత్సవాలు, జాతీయ నాటక ప్రదర్శనలు, జాతీయహిందీ నాటకోత్సవాలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రదర్శనలు అందించి తనదైన ప్రత్యే కతను చాటుకుంది. ‘ప్రపంచమే ఒక నాటక రంగం. ప్రతి ఒక్కరం పాత్ర ధారు లమే!’ దర్శకుడు వేర యినా, మనమే అయినా, జీవితం అనే తెర పడే వరకూ అంకాలు మారుతూ బ్రతుకు దృశ్యాలు ఘటనలూ, సంభా షణలూ వెలుగు నీడలతో వివిధ రసా లతో సాగుతూనే ఉంటాయి అనే మాట మనం వింటూ వస్తున్నదే !

అటువంటప్పుడు నాటకమే ప్రపంచంగా, సమాజహిత చింతనతో కృషి చేస్తున్న నాటకరంగం సంస్థలను సమాదరించడం జనకర్తవ్యం. వారు కోరుతున్నది నాటకం చూడమని! నాటకాన్ని సమాదరించడం అంటే జీవితాన్ని సమాదరించడమే! మనిషినీ, మానవతనూ సమాదరించడమే!

- వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి
-సుధామ 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)