Breaking News

ప్రపంచ సాహిత్యంలో దీప కాంతులు

Published on Wed, 05/28/2025 - 00:44

మూల రచయిత బాను ముష్టాక్‌(Banu Mushtaq)  తన కమ్యూనిటీలోని స్త్రీల సమస్యలను చిన్న చిన్న కథలుగా అక్షరీకరిస్తే .. ఆ సహజత్వాన్ని, సున్నితత్వాన్ని అంతే చక్కగా అంగ్లీకరించి తన స్పందననూ తెలియజేశారు దీపాభష్ఠీ! ఈ రచనతో బాను ముష్టాక్‌ బుకర్‌ ప్రైజ్‌ అందుకున్న తొలి ప్రాంతీయ భాషా రచయితగా, రెండో భారతీయురాలిగా నిలిస్తే, ఇదే రచనతో దీపాభష్ఠీ(Deepa Bhasthi).. బుకర్‌ ప్రైజ్‌ అందుకున్న తొలి భారతీయ అనువాదకురాలిగా ప్రపంచ సాహిత్య రంగంలో చరిత్ర సృష్టించారు. ‘హార్ట్‌ ల్యాంప్‌’ కన్నడ సాహిత్యంలో ఓ గొప్ప అచీవ్‌మెంటే కాదు ప్రపంచపాఠకులకు గొప్ప కానుకగా అభివర్ణిస్తున్నారు సాహిత్యకారులు. అంతేకాదు దీపాభష్ఠీ అనువాదం చిక్కగా..పాఠకులను ఉత్తేజపరిచేలా ఉంది. ఇలాంటి శైలి నేటి ఆంగ్ల కాల్పనిక సాహిత్యంలో అరుదుగా కనిపిస్తోందని ప్రశంసిస్తున్నారు.

దీపాభష్ఠీ సొంతూరు కర్ణాటకలోని కొడగు జిల్లా, మడికేరి. మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేశారు. ఆమె అనువాదకురాలే కాదు పిల్లల రచయిత, కాలమిస్ట్, సాంస్కృతిక విమర్శకురాలు కూడా. దీపారాసిన వ్యాసాలు, కాలమ్స్, సాంస్కృతిక విమర్శలు, ఫిక్షన్స్‌ ఎన్నో జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కన్నడ ప్రముఖ రచయిత కోట శివరామ కారంత్‌ నవల ‘అదే ఊరు, అదే మార’ను ‘ద సేమ్‌ విలేజ్, ద సేమ్‌ ట్రీ’గా, కన్నడ స్త్రీవాద రచయిత కొడగిన గౌరమ్మ రచన ‘ఫేట్స్‌ గేమ్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌’గా ఆంగ్లంలోకి అనువదించారు. మూల రచనను ఉన్నదున్నట్టుగా అనువదించడం ఆమె స్టయిల్‌ కాదు. ఆ రచనల్లోని ఆత్మను పట్టుకుంటారు. అందుకే మూల రచనల్లోని స్థానికత ఆమె అంగ్ల అనువాదంలో ఎక్కడా మిస్‌ కాదు.

పాఠకులకు మూల రచన చదివిన అనుభూతే కలుగుతుంది. ఆ శైలికే బుకర్‌ ఆమెను వరించింది. ‘హార్ట్‌ ల్యాంప్‌’ను అనువదించే ముందు దీపా.. ఇస్లాం స్త్రీల తీరుతెన్నులు, సంస్కృతీసంప్రదాయాలు, పద్ధతులు తెలుసుకోవడానికిపాకిస్తానీ సీరియల్స్‌ చూసేవారట. ఉర్దూ చదవడం, రాయడం వరకే కాకుండా సామెతలు, జాతీయాలు, నుడికారాలు సహా భాషను నేర్చుకున్నారట. ఆ కమిట్‌మెంటే ఆమెకు ఈ రోజు ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఆమె రాసిన పిల్లల పుస్తకం ‘చంపి అండ్‌ ఫిగ్‌ ట్రీ’ పుస్తకం త్వరలోనే పబ్లిష్‌ కానుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)