CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
జీ తెలుగు ‘స రే గ మ ప - సీజన్ 16’ .. త్వరలో
Published on Mon, 09/09/2024 - 15:56
తెలుగు నాట సంగీతానికి సంబంధించిన రియాల్టీ షోలు బుల్లితెరపై బహుళ ఆదరణ సంపాదించాయి. అలాంటి వాటిల్లో ఒకటి జీ తెలుగు సమర్పించిన సరిగమప. ఈ కార్యక్రమం ద్వారా గత 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇపుడిక ‘సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ త్వరలో రాబోతోంది.
ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహంచింది. కొత్త గాయకులను పరిచయం చేసే ఈ పోటీలో 15-30 సంవత్సరాల వయస్సుగల , గాయనీ గాయకులు పాల్గొనేందుకు అర్హులు. విజేతగా నిలిచిన గాయని లేదా గాయకుడు ‘సరిగమప సీజన్ 16–ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ టైటిల్ గెల్చుకుంటారు.
#
Tags : 1