Breaking News

యువరాజా ఇదేం అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌..? ఏంటీ తీరు..?

Published on Thu, 10/24/2024 - 13:15

‘సున్నితమైన విషయాలలో ఎలా స్పందించాలో, ఆరోగ్య సమస్యలపై ఎలా అవగాహన కలిగించాలో కొందరికి కనీస స్పృహ లేకుండా పోతోంది. ఒక దేశం బ్రెస్ట్‌ కేన్సర్‌పై ప్రజలలో అవగాహన ఎలా పెంచుతుంది?! రొమ్ము కేన్సర్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌లలో ‘మీ ఆరెంజ్‌లను చెక్‌ చేసుకోండి’ అంటూ తెలియజేసే ప్రకటన పోస్టర్‌ను ఢిల్లీ మెట్రోలో చూశాను. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాను. 

ఈ ప్రచారాలు ఎవరు చేస్తారు, వీటిని ఎవరు ఆమోదిస్తారు? ఈ పోస్టర్‌ను పబ్లిక్‌లోకి తీసుకు రాగలిగేటంత మూర్ఖులు మనల్ని పరిపాలిస్తున్నారా?!’ అంటూ ఒక మహిళ తన ఎక్స్‌ ఖాతాలో తీవ్రంగా దుయ్యబట్టారు. కేన్సర్‌ సర్వైవర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ స్వచ్ఛంద సంస్థ ‘యువికాన్‌’ ఈ ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

దీని వెనుక ఉద్దేశం రొమ్ము కేన్సర్‌ పట్ల సామాన్యులలో అవగాహన కల్పించడమే. కానీ, ఇలాంటి ప్రచారాలు కొన్నిసార్లు అసౌకర్యంగానూ, పనికిమాలినవిగానూ కనిపిస్తాయి. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ యూజర్లు కామెంట్ల రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ‘ఇది క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ క్యాంపెయిన్‌ అని తెలుసుకున్నాను. వీరి ఉద్దేశ్యం సరైనదే కావచ్చు. కానీ, ఇది నిజంగా అసహ్యకరమైనది. ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలనుకుంటున్నాను’ అని ఒకరు కామెంట్‌ చేశారు. 

‘భారతదేశంలో బ్రెస్ట్‌ కేన్సర్‌ పట్ల ఒక శాతం మందికి కూడా సరైన అవగాహన లేదు. తలాతోకా లేని ఇలాంటి ప్రకటన ద్వారా ప్రజలకు  విషయం ఎలా చేరుతుంది అనుకుంటున్నారు? స్త్రీలను కించపరిచేలా ఉన్న ఈ ప్రకటన సరైనది కాదు’ అని ఇంకొకరు, ‘సమస్యను ఎంత బాగా అర్థమయ్యేలా తెలియజేయాలో ఆ ఫౌండేషన్‌ వాళ్లకే అర్థం కాలేదు’ అని మరొకరు ‘ప్రకటనదారులు సున్నితమైన విషయాలను పట్టించుకోరు, ఆకట్టుకునే విధంగా డిజైన్‌ చేయడమే లక్ష్యంగా పనిచేస్తారు’ అని ఒకరు ‘ఇది గ్రామీణ జనాభా కోసం కాదు. కేవలం ఇంగ్లిషు మాట్లాడే మహిళల కోసమే’ అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు.   

(చదవండి: చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..?        )

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)