Breaking News

50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్‌ ఫుడ్‌ ఛాలెంజ్‌..కట్‌చేస్తే..!

Published on Tue, 10/15/2024 - 11:50

ఆరోగ్యం కోసం మంచి సమతుల్య ఆహారం తీసుకోవడమే మేలు. కానీ ఒక్కోసారి జిహ్వ చాపల్యం చంపుకోలేక ఇష్టమైన జంక్‌ ఫుడ్‌ని లాగించేస్తాం. పైగా ఏదో అప్పుడప్పుడే కదా అని సర్ది చెప్పుకుని మరీ తినేస్తాం. ఆ తర్వాత వర్కౌట్‌లు చేసి అదనపు కేలరీలను తగ్గించే యత్నం చేస్తాం. కానీ ఇలా తినడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ప్రయోగాత్మకంగా తెలియజేశాడు ఓ యూట్యూబర్‌. అందుకోసం అతడు ఏం చేశాడంటే..

ఫిట్‌నెస్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అయిన 30 ఏళ్ల కెనడియన్‌ టెన్నిసన్‌ ఓ విచిత్రమైన ఫుడ్‌ ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. ఆయన 50 గంటల ఫాస్ట్‌ ఫుడ్‌​ మారథాన్‌ సవాలును స్వీకరించాడు. అందుకోసం తన బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి లంచ్‌, డిన్నర్‌తో సహా మొత్తం ఫాస్ట్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఐటెమ్స్‌ వంటివి మాత్రేమ తీసుకున్నాడు. వాటిలో తృణధాన్యాలు, పెరుగు వంటివి కూడా ఉన్నాయి. 

తొలిరోజు అలాంటి ఫుడ్‌ తింటూ 8 వేల కేలరీలను వినియోగించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆహారం కారణంగా తన మానసిస్థితి, శక్తి స్థాయిలోని ప్రతికూల భావాలను గుర్తించినట్లు తెలిపాడు. రెండో రోజు కూడా ఇలానే తినడం వల్ల గ్యాస్‌ సమస్యతో ఇబ్బంది పడ్డట్లు తెలిపాడు. ఎక్కువ మొత్తంలో కేలరీలను పెంచినప్పటికీ పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. ఈ ఫుడ్‌ కారణంగా ముఖంపై మొటిమలు రావడం మొదలయ్యిందని వెల్లడించాడు. 

ఆ తర్వాత కండరాలు తిమ్మిరిగా ఉండి బద్ధకంగా ఏదో తెలియని నీరసంతో ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించిందని వెల్లడించాడు. అలాగే ఈఫుడ్‌కి తగ్గట్టు చేయాల్సిన పదివేల స్టెప్స్‌కు బదులుగా తాను 4 వేల స్టెప్స్‌ నడిచినట్లు పేర్కొన్నాడు. ఈ రెండు రోజుల ఛాలెంజ్‌ తదనంతరం మూడో రోజు జిమ్‌సెషన్‌ అత్యంత భయంకరమైనది. ఎందుకంటే ఈ అధిక కేలరీల ఫుడ్‌ కారణంగా విపరీతమైన చెమట్లు పట్టి..వర్కౌట్లు చేయడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కలిగే పరిణమాల గురించి తెలియజేసేందుకే ఈ 50 గంటల ఫాస్ట్‌ ఫుడ్‌ ఛాలెంజ్‌ని స్వీకరించానని యూట్యూబర్‌ వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆహారంతో మిళితమైన శారీరక సంబంధం గురించి చాలా క్లియర్‌గా వివరించి మరీ చెప్పారంటూ సదరు యూట్యూబర్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!)
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)