Breaking News

శ్రేయోవి కేరాఫ్‌ అడవి

Published on Sat, 09/14/2024 - 11:31

అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. ‘కాస్త ఫొటో తీయరా’ అనంటే బుడుంగుమని వచ్చి క్లిక్‌ చేస్తాం. అంతమాత్రం చేత మనం ఫొటోగ్రాఫర్లం అవము. ఫొటోగ్రఫీ పెద్ద ఆర్ట్‌. ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ, ఔట్‌డోర్‌ ఫొటోగ్రఫీ, స్టిల్‌ ఫొటోగ్రఫీ... ఇలా చాలా విభాగాలున్నాయి. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ కూడా ఒకటి. అంటే వన్యజీవితాన్ని ఫొటోలు తీయడం. దీనికి అభిరుచి, ధైర్యం, నైపుణ్యం కావాలి. అడవుల్లోకి వెళ్లి రోజుల తరబడి ఎదురు చూస్తేనే ఒక మంచి ఫొటో దొరుకుతుంది. అలాంటి ఫొటో తీసి అంతర్జాతీయ గుర్తింపు పోందింది శ్రేయోవి మెహతా.

ఫరిదాబాద్‌లో నాల్గవ తరగతి చదువుతున్న ఈ 9 సంవత్సరాల చిన్నారి చిన్నప్పటి నుంచి ఫొటోలు తీయడం నేర్చుకుంది. కారణం ఆమె తండ్రి శివాంగ్‌ మెహతా మంచి ఫొటోగ్రాఫర్‌. తల్లి కహాని మెహతా పర్యాటకులను అభయారణ్యాలకు తీసుకెళుతుంటుంది. శ్రేయోవి తన తల్లిదండ్రులతో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నేషనల్‌ పార్క్‌లో ఉన్నప్పుడు ఒక తెల్లవారుజామున వాకింగ్‌ చేస్తుంటే హటాత్తుగా దూరంగా రెండు నెమళ్లు కనిపించాయి. పక్కనే ఒక లేడి కూన. వెంటనే శ్రేయోవి తన కెమెరా తీసి మోకాళ్ల మీద కూచుని క్లిక్‌ చేసింది. ఆ తెల్లవారుజామున మంచుకురుస్తున్న వేళ చీకటి వెలుతురుల్లో ఆ ఫొటో అద్భుతంగా కుదిరింది.

60 వేల ఎంట్రీల్లో ఒకటి
లండన్‌లోని ‘నేచురల్‌ హిస్టరీ మ్యూజియం’ ప్రతి ఏటా ‘వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌‘ అవార్డు కోసం ఎంట్రీలు పిలుస్తుంది. ఇందులో వయసును బట్టి విభాగాలుంటాయి. 10 ఏళ్ల లోపు విభాగంలో 117 దేశాల నుంచి 60 వేలమంది బాలలు తాము తీసిన వైల్డ్‌లైఫ్‌ ఫొటోలు పంపితే శ్రేయోవి ఈ ఫొటో పంపింది. ఇంతమందిని దాటి శ్రేయోవి ఈ ΄ోటీలో రన్నర్‌ అప్‌గా నిలిచింది. అంటే సెకండ్‌ ప్లేస్‌ అన్నమాట. అయినా సరే ఇది పెద్ద విజయం. ‘మా అమ్మా నాన్నా ప్రోత్సహించడం వల్ల నేను ఇలా గుర్తింపు పోందాను’ అంటోంది శ్రేయోవి. పెద్దయ్యి ఇంకా గొప్ప ఫొటోలు తీస్తానంటోంది. 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)