ఎనిమిదేళ్లకే పర్వతాలు అధిరోహిస్తున్న చిచ్చర పిడుగు..!

Published on Fri, 02/28/2025 - 18:34

తెలంగాణలోని  సిద్దిపేట జిల్లా  హనుమతండాకి చెందిన జాటోత్‌ తిరుపతి నాయక్, వాణి దంపతుల కుమారుడు విహాన్‌ రామ్‌ 4వ తరగతి చదువుతున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించిన ఎంతోమంది సాహసికుల కథలను పెద్దల నోటినుంచి వినేవాడు. ఆ సాహసాల నుంచి స్ఫూర్తి పొందిన విహాన్‌ ‘నేను కూడా’ అని రెడీ అయ్యాడు.

‘ఈ వయసులో ఎందుకులే’ అని తల్లిదండ్రులు అనలేదు. ఓకే అన్నారు. లెంకల మహిపాల్‌ రెడ్డి దగ్గర మూడు నెలల పాటు ట్రెక్కింగ్‌లో విహాన్‌  శిక్షణ తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌ మనాలీలో 15రోజుల పాటు బేసిక్‌ మౌంట్‌ ట్రైనింగ్‌  తీసుకున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోగల మౌంట్‌ పాతాల్పు పర్వతం 4,250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గత సంవత్సరం ఈపర్వతాన్ని అధిరోహించి రికార్డ్‌ సృష్టించాడు.

టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 10న మొదలుపెట్టి 5 రోజుల్లో మైనస్‌ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు.

చిన్న వయస్సులోనే పర్వతాలను అధిరోహిస్తున్న విహాన్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సన్మానించి, చేతి గడియారం బహుమతిగా అందజేశారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌లో చోటు సాధించాడు విహాన్‌. ‘ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది నా లక్ష్యం’ అంటున్నాడు విహాన్‌ రామ్‌. విజయోస్తు...విహాన్‌!
– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)