Breaking News

వింత సంగ‌తి: ఆ ఏడాదిలో అసలు వేసవే లేదు!

Published on Sat, 03/07/2026 - 12:55

మార్చి నెల వచ్చేసింది. ఎండ తాపం మొదలైంది. జనాలు అప్పుడే ఎండ వేడిమి తాళలేక ఉసూరుమంటున్నారు. బయటి వెళ్లినవారు మజ్జిగ, చెరుకురసం, పళ్లరసాలను తాగుతూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఏటా వేసవి కాలంలో ఇవన్నీ సహజంగా జరిగేవే. అయితే ఒకానొక సంవత్సరం అసలు వేసవే లేకుండా గడిచిపోయింది. ఆ విషయం మీకు తెలుసా?

అవును..1816 సంవత్సరం వేసవి లేకుండా గడిచిపోయింది. అందుకే దాన్ని ‘The Year without Summer’ అని పిలుస్తారు. ఆ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 0.4–0.7 సెంటిగ్రేడ్‌లు తగ్గాయి. ఆ సంవత్సరం యూరప్‌లో వేసవి ఉష్ణోగ్రతలు సైతం అత్యంత చల్లగా ఉన్నాయి.

1815 ఏప్రిల్‌లో ఇండోనేషియాలో మౌంట్‌ టాంబోరా విస్ఫోటనం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. 1,300 సంవత్సరాలలో ఇది అతి పెద్ద విస్ఫోటనం అంటున్నారు. వాతావరణంపై దాని ప్రభావం పడటం వల్ల వేసవి లేకుండా గడిచిపోయిందంటున్నారు. ఎండలు లేకపోతే హాయిగా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనకు ఎండలు చాలా అవసరం.

చ‌ద‌వండి: అత్యంత య‌వ్వ‌నంగా 60 ఏళ్ల తాత‌!

ఎండలు లేకపోతే వర్షాలు సక్రమంగా కురవవు. పంటలు సరిగ్గా పండవు. దీంతో 1816లో ప్రపంచం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్, ఐర్లాండ్, బోర్బన్‌ రిస్టోరేషన్‌ ఫ్రాన్స్ వంటి దేశాలు కరువు బారిన పడ్డాయి. 1816 తర్వాత మళ్లీ ఇప్పటిదాకా వేసవి లేని ఏడాది రాలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)