Breaking News

'మాలి' ఇక లేదు!

Published on Thu, 11/30/2023 - 12:33

పిలిప్పీన్స్‌ జూలో ఉన్న మాలి అనే వృద్ధ ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగు ప్రంచంలోనే అత్యంత విషాదకరమైన ఏనుగుగా పేరుగాంచింది. ఐతే ఏనుగులు వృద్ధవి అయ్యి ఏదో ఒక రోజు చనిపోతాయి. ఇది సర్వసాధారణం. మరీ ఈ ఏనుగు మరణం, ఎందుకు? వార్తల్లో నిలిచింది. పైగా జంతు ప్రేమికులు, ప్రముఖులు దాని మరణానికి ఇంతలా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి. ఏంటీ ఆ ఏనుగు ప్రత్యేకత అంటే...

నాలుగా దశాబ్దాలు మనీలా జూలో ఆకర్షణగా నిలిచిన మాలి అనే వృద్ధ ఏనుగు మంగళవారమే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినట్లు జూ అధికారలు తెలిపారు. ఈ ఏనుగు ఫిలిప్పీన్స్‌ జూ అధికారులు ఒక కాంక్రీట్‌ ఎన్‌క్లోజర్‌లో బందించారు. దీన్ని చూసిని పలువురు జంతు హక్కులు కార్యకర్తలు చలించిపోయి అభయారణ్యంలో వదిలేయాలని పలు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ మాలి అనే ఏనుగు పేరు వార్తల్లో నిలిచింది. దీని గురించి క్యాథలిక్‌ బిషప్‌లు, గ్లోబల్‌ పాప్‌ స్టార్‌, నోబెల్‌ గ్రహిత కోయెట్జీ వంటి ప్రముఖులు దాని విడుదల కోసం మద్దతు తెలుపుతూ ఆందోళనలు చేశారు.

అంతేగాదు ఆ ఏనుగును థాయ్‌లాండ్ అభయారణ్యానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి పలు సంతాకాలతో కూడిన లేఖలను కూడా రాశారు. అయితే మాలీని మనీలా జూలోనే ఉంచాలనే నిర్ణయాన్ని పట్టుబట్టింది ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం. దీన్ని సమర్థించారు మనీలా నగర మేయర్ హనీ లాకున కూడా. అదీగాక ఆ ఏనుగు చాలా కాలం బందీగా ఉన్న కారణంగా బయట జీవించడం అసాధ్యం అని పేర్కొంది జూ. దీంతో సుదీర్ఘకాలం ఏకాంతంగా బంధీగా ఉన్న ఏనుగుగా పేరుగాంచింది. అందువల్ల జంతుప్రేమికులు ఈ ఏనుగుకు ప్రంచంలోనే అత్యం విషాదకరమైన ఏనుగుగా పిలిచారు. 

ఎలా ఈ జూకి వచ్చిందంటే..
శ్రీలంక ప్రభుత్వం అప్పటి ఫిలిప్పీన్స్ ప్రథమ మహిళ ఇమెల్డా మార్కోస్‌కు 11 ఏళ్ల వయసులో ఉన్న ఈ చిన్న ఏనుగును బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ ఏనుగుని జూకి తరలించడానికి ముందు  మలాకానాంగ్ ప్యాలెస్‌లో ఉంది. ఆ తర్వాత మనీలా జూలో మాలిని 'షిబా' అనే మరో ఆడ ఏనుగుతో ఒక ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. మాలి దూకుడుగా ప్రవర్తించడంతో షిబా అనే ఏనుగు మరణించింది. దీంతో జూ అధికారులు దీన్ని నిర్బంధించారు. ఇలా ఏకాంత నిర్బంధంలోనే దశాబ్దాలుగా మగ్గిపోయింది. దీంతో పలువురు ప్రముఖులు, జంతు ప్రేమికులు దీని విడుదల కోసం ఎంతగానో యత్నించి విఫలమయ్యారు. కనీసం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించమని కోరారు. అందుకు కూడా జూ అధికారులు ఒప్పుకోలేదు. అది ఇక్కడ ఇతర జంతువుల తోపాటు తమ కుటుంబంలో బాగమని స్పష్టం చేసింది జూ యాజమాన్యం.

చనిపోవడానికి కారణం..
ఈ మాలి ఏనుగు బాగోగులు చూసుకోకపోవడం వల్లే చనిపోయిందంటూ విమర్శలు వెల్లువలా వచ్చాయి. అదెంత మాత్రం నిజం కాదని కొట్టి పారేశాడు జూ పశువైద్యుడు హెన్రిచ్‌ డొమింగో. ఆ ఏనుగు ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. జంతు ప్రేమికులు, సామజిక కార్యకర్తలు దాన్ని నిర్బంధించి భౌతికంగా ఎప్పుడో చంపేశారంటూ ఆరోపణలు చేశారు. కాగా, అంతేగాదు చనిపోయిన మాలి స్థానాన్ని భర్తీ చేసేలా శ్రీలంక అధికారులను మరో ఏనుగును ఇవ్వమని కోరింది. ఇక ఈ మాలి అస్థిపంజరాన్ని దాని గుర్తుగా జ్యూమ్యూజియంలో పెడతామని నగర మేయర్‌ లాకునా చెప్పారు.

(చదవండి: ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది)

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)