Breaking News

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'కర్రీ' ఏంటో తెలుసా!

Published on Mon, 04/15/2024 - 18:00

పురాతన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు, ఆయుధాలు, విలువైన వస్తువుల గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే వేటితో వంటలు చేసుకునేవారు, వారు ఉపయోగించిన వంట సామాగ్రి గురించి విన్నాం. కానీ పురాతన కాలంలో ఎలాంటి కూరలు వండుకునేవారు, ఏం తినేవారు తెలియదు. వాటి గురించి చరిత్రకారులు రాసిన దాఖాలాలు కూడా లేవు. అయితే తాజాగా ఫర్మానాలో జరిపిన తవ్వకాల్లో నాలుగువేల ఏళ్ల నాటి పురాతన వంటకం వెలుగులోకి వచ్చింది. మన పూర్వీకులు అప్పట్లోనే అలా వండుకుని తినేవారా అని కంగుతిన్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ అదేం కర్రీ?.. ఏ దేశపు వంటకం అంటే..

మన పూర్వీకుల తరుచుగా ఏం వంటకాలు వండుకుని తినేవారు అనే దిశగా సాగిన తవ్వకాల్లో కొంత వరకు పురొగతి సాధించారు శాస్త్రవేత్తలు. ప్రతి వంటకం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి వచ్చిన వంటకాలే. అయితే ఆ కాలంలో కుండలు, దంతాల అవశేషాల సామాగ్రితో చేసుకునేవారు. ఇక్కడ శాస్త్రవేతలు హరప్పా నగరమైన రాఖీగర్హికి ఆగ్నేయంగా ఉన్న ఫర్మానాలో పూర్వీకుల వంటకాలు గురించి చేసిన అన్వేషణలో  నాలుగు వేల ఏళ్ల నాటి పురాతన వంటకాన్ని గుర్తించారు

వారు తవ్వకాల్లో ఒక కుండలో పసుపు, అల్లం, వెల్లుల్లి, వంకాయలతో చేసి అవశేషాలను గుర్తించారు. ఈ మిశ్రమం ఆధునికులకు బాగా తెలిసిన రెసిపీనే. ముఖ్యంగా ఇది భారతదేశ వంటకం. దీంతో ఈ కూర ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదయ్యిన పురాతన కూరల్లో ఒకటిగా నిలిచింది. మన పూర్వీకులు, అరటి పండ్లు, మామిడి వంటివి తినేవారని, పొట్లకాయ, ఖర్జురాలు ఎక్కువగా ఉపయోగించినట్లు తవ్వకాల్లో గుర్తించారు గానీ కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే తాజాగా గుర్తించిన పురాతన కూరలో వాడిన అల్లం పసుపు హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లోనే గుర్తించడం జరిగింది.

అంతేగాదు ఈ సుగంధ ద్రవ్యాలే 2023లో వియత్నాంలో 2 వేల ఏళ్ల నాటి ఇసుకరాయి స్లాబ్‌పై కనిపించి కూర అవశేషాల్లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడ పరిశోధకులు మైక్రోస్కోపిక్ ద్వారా స్టార్చ్ ధాన్యాలను పరిశీలించారు. విశ్లేషణలో పసుపు, అల్లం, వంటి విభిన్న సుగంధద్రవ్యాల మూలాలను గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే ఆసియా వంటకాల మూలాలు చరిత్రలో స్థిరంగా ఉ‍న్నాయని తెలుస్తోందన్నారు శాస్తవేత్తలు. ఇక పురాతన వంటకాన్ని ఎలా చేస్తారో చూద్దామా..!

మన భారతీయలు ఈజీగా చేసుకునే వంకాయ వేపుడే!.. నాటి పుర్వీకులు చేసుకునేవారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే.. వంకాయ వేపుడు పురాతన వంటకంగా తెలుస్తోంది. ఈ రెసిపీని నాటి పూర్వీకులు ఎలా చేసుకున్నారనే దాని గురించి ప్రముఖ చెఫ్‌ కునాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సవివరంగా వెల్లడించారు. 

కావాల్సిన పదార్థాలు. .
రెండు పెద్ద సైజు వంకాయలు
నాలుగు టేబుల్‌ స్పూన్ల నూనె
అల్లం వెల్లుల్లి పేస్ట్‌
కరివేపాకు
పసుపు
ఉప్పు తగినంత

తయారీ విధానం: ఓ కడాయిలో నూనె వేసుకుని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేయించి ఆ తర్వాత తరిగి పెట్టుకున్నవంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఓ ఐదు నిమిషాలు అలాగే స్టవ్‌ మీద ఉంచి తర్వాత దించేయాలి. అంతే వంకాయ వేపుడు రెడీ..!

(చదవండి: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!)


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)