Breaking News

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్‌ బాటిల్‌!..ఒక లీటర్‌కే..!

Published on Thu, 07/04/2024 - 12:48

మన ప్రాథమిక అవసరాల్లో నీరు కూడా ఒకటి. నీరు లేకుండా భూమిపై మనుగడ సాగించడం అనేది అసాధ్యం. పెరుగుదలకు, నిర్వహణకు ఎంతో అవసరం నీరు. మానవ శరీరం దాదాపు 60% నీటితోనే ముడిపడి ఉంటుంది. మానవ శరీర పనితీరుకు అత్యంత అవసరం ఇది. ముఖ్యంగా జీర్ణక్రియ, శోషణ,పోషకాల రవాణాను సులభతరం చేయడంలో నీను ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సెల్యులార్‌ ఫంక్షన్‌కు మద్దతు ఇస్తుంది. వంట చేసే దగ్గర నుంచి క్లీన్‌ చేయడానికి, చెట్లకు, జంతుజాలం ఉనికికి నీరు అవసరం. అలాంటి నీరుని అత్యంత ధరల్లో కూడా విక్రయిస్తారనే విషయం గురించి విన్నారా?. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్‌ బాటిల్‌ ఒకటి ఉంది. ఒక లీటర నీటికే ఎంత వెచ్చించాలో వింటే కంగుతింటారు. ఎందుకంతా అంటే..

ఈ నీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయడం, దాని స్వచ్ఛత, ఫ్యాకేజింగ్‌ విధానం తదితరాల కారణంగా అంత లగ్జరీయస్‌ ఉంటుంది ఈ వాటర్‌ బాటిల్‌ ధర. వీటిని ప్రసిద్ధి బ్రాండ్‌ విడుదల చేస్తుంది. దీనిని ఫిల్లికో జ్యువెలరీ వాటర్‌ అని పిలుస్తారు. ఈ బాటిల్స్‌ని స్వరోవ్స్కీ స్పటికాలతో అలంకరిస్తారు. చక్కటి ఆభరణాల ముక్కలతో డిజైన్‌ చేస్తారు. అందువల్ల దీని ధర అంత రేంజ్‌లో ఉంటుంది. జపాన్‌లో కోబ్‌లోని సహజమైన నీటి బుగ్గ నుంచి తీసుకున్న నీరు ఇది. 

నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. దీనికి తగ్గట్టుగా బాటిల్‌ డిజైన్‌ కూడా లగ్జరియస్‌గా ఉంటుంది. ప్రతి బాటిల్‌ని బంగారంతో డిజైన్‌ చేస్తారు. ఈ డిజైన్‌ని జపాన్‌ హస్తకళను హైలెట్‌ చేసేలా రూపొందిస్తారు. కొన్నిబ్రాండ్‌లు బంగారం, ప్లాటినం, అంతకంటే విలువైన రాళ్లతో డిజైన్‌ చేస్తారు. ఆ బాటిల్‌కి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకురావడమే గాకుండా అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేస్తున్నందుకు తగ్గట్టుగా ఆ బాటిల్‌ లుక్‌ ఉంటుంది. ఇంతకీ ఈ బాటిల్‌ లీటర్‌ నీటి ధర ఏకంగా రూ. 1,16,000/-

(చదవండి: చీరకట్టులో హులా హూపింగ్‌..అథ్లెటిక్‌ సామర్థ్యాలతో..!)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)