Breaking News

కంటినిండా నిద్రకోసం...

Published on Fri, 03/13/2026 - 05:41

కంటి నిండా నిద్రపట్టేందుకు ఈ కింది సూచనలు పాటించవచ్చు. ఈ ఏడాది స్లీప్‌ డే థీమ్‌ ‘స్లీప్‌ వెల్‌... లివ్‌ బెటర్‌’ అంటూ హాయిగా నిద్రపోతూ... చక్కగా జీవించడానికి ఈ కింద పేర్కొన్నవి అనుసరించడం మేలు.

⇒ రోజూ ఒకే వేళకు నిద్రపోవడం, ఉదయం మళ్లీ వేళకు నిద్రలేవడం.
⇒ బెడ్‌రూమ్‌ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం.
⇒ పడక గది మరీ చల్లగా అదేవిధంగా వురీ ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోవడం.

⇒ నిద్రవేళలో మరీ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోడం. ఇలా గదిలో ఎక్కువ వెలుగు లేకుండా మసక చీకటి ఉన్నప్పుడు నిద్రలోకి జారుకునేలా చేసే ‘మెలటోనిన్‌’ అనే జీవరసాయనం విడుదల అవుతుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది వెలువడదు. అందుకే నిద్రపోవడాలనుకున్నవారు కళ్లపై ఏదైనా కప్పుకుంటారు.
⇒ ΄÷గతాగడం, ఆల్కహాల్‌ తీసుకునే అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండటం.
⇒ సాయంత్రం ఆరు దాటాక కాఫీ, టీలతో పాటు కెఫిన్‌ ఉండే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండటం.
⇒ రాత్రిపూట నిద్రకు ముందర గోరువెచ్చని నీటితో స్నానం చేయడం.

⇒ రాత్రి భోజనం త్వరగా భోజనం ముగించడం. మరీ కడుపు నిండుగా తినకపోవడం మేలు.
⇒ నిద్రకు వుుందు టీవీలో ఉద్విగ్నభరితమైన లేదా ఉద్వేగాన్ని కలిగించే దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు చూడకపోవడం. (వీలైతే బెడ్‌రూమ్‌లో టీవీ లేకుండా చూసుకోవడం మేలు. బెడ్‌రూమ్‌లో కూర్చుని పనిచేయకూడదు. పడకగదిని వర్క్‌ప్లేస్‌గా మార్చడం సరికాదు.

⇒ రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో (డే లైట్‌) గడపడం మంచిది.
⇒ నిద్రకు వుుందు హాయిగొలిపే ఆహ్లాదకరమైన లైట్‌ వు్యూజిక్‌ను వినడం మంచిది. రణగొణధ్వని ల్లాంటి వు్యూజిక్‌తో నిద్రపట్టదు.
⇒ నిద్రకు ముందర గోరువెచ్చని పాలు తాగడం మంచిది. గోరువెచ్చని పాలలో ఉండే ‘ట్రి΄÷్టఫాన్‌’ అనే ఓ అసెన్షియల్‌ అమైనోయాసిడ్‌ నిద్ర పట్టేలా చేస్తుంది.

⇒ నిద్రకు వుుందు పుస్తకాలు చదివితే కొందరికి నిద్ర వస్తుంది కానీ... అందులో ఉత్కంఠకు గురిచేసే ఆసక్తికరమైన విషయాలున్న పుస్తకాలు చదవద్దు. నిద్రపట్టడానికి ఉపకరించేందుకే పుస్తకపఠనం తోడ్పడాలి తప్ప నిద్రకు దూరం చేయకూడదు.
⇒ వాకింగ్‌ వంటి వ్యాయమాలు చేయాలి. అయితే వాటిని ఉదయం వేళలోనే చేయడం మంచిది. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు కఠిన వ్యాయామాలు చేయడం సరికాదు. నిద్రకు ముందు చేసే వ్యాయామాలతో ఒక్కోసారి నిద్రపట్టకపోవచ్చు.
⇒ మంచి నిద్ర కోసం అనుసరించాల్సిన మంచి అలవాట్లను ‘స్లీప్‌ హైజీన్‌’గా పేర్కొంటారు. ఈ ‘స్లీప్‌ హైజీన్‌’ను అనుసరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది. 

– యాసీన్‌
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)