Breaking News

నీలాల కన్నుల్లో మెలమెల్లగా....

Published on Fri, 03/13/2026 - 05:53

బాగా నిద్ర పోండి... హాయిగా జీవించండి
ప్రపంచ నిద్ర దినోత్సవం 2026 థీమ్‌: స్లీప్‌ వెల్, లివ్‌ బెటర్‌ శారీరక, మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర అవసరం అని వరల్డ్‌ స్లీప్‌ సొసైటీ నొక్కి చెబుతోంది. 
3–3–3 రూల్‌ అనేది నిద్ర నాణ్యతను విశ్లేషించుకునే రూల్‌.
ఒకటి... మూడు రోజులుగా మీకు సరిగా నిద్ర పట్టడం లేదా?
రెండు... మూడు నెలలుగా మీకు సరిగా నిద్ర పట్టడం లేదా?
మూడు... నిద్ర లేమి అనేది మూడు సమస్యల (అలసట, మూడ్‌ సరిగా లేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం)కు కారణం అవుతుందా? అని ఎవరికి వారు విశ్లేషించుకోవడమే 3–3–3 రూల్‌.

‘నిద్ర సుఖమెరగదు’ అని అంటారు గానీ...
మొద్దు నిద్రకు మించిన భాగ్యం లేదని నిద్ర పట్టనివారు వగస్తుంటారు. ఎంత వైభవం ఉన్నా. కంటి నిండా నిద్ర... అసలైన భాగ్యం. అందుకే పెద్దలు ‘జోకొట్టే’ పాటలు పాడేవారు పసిపిల్లలకు. మరి పెద్దలకు? సినిమా పాటలు ఉన్నాయిగా. వినండి. కంటి నిండా నిద్రపోండి.

‘నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదురా రావమ్మ రావే నిండారా రావే’....
నిద్రను కూడా బుజ్జగించి లాలించాలేమో. ముద్దు చేస్తూ ఆహ్వానించాలేమో. నిద్రను ప్రతి మనిషి తన మనసు పాదులో మొక్కలా చేసి రోజూ కాసిని నీళ్లు పోసి పెంచుకుంటూ రావాలేమో. పచ్చటి చెట్టులా అది ఎదిగితే కోరినన్ని నిద్రాఫలాలు ఇస్తుందేమో. రోజూ కొన్ని ఆరగించి బజ్జోవాలేమో.
ఉన్నప్పుడు విలువ తెలీదు. లేనప్పుడు ఏం చేసినా పొందడానికి రాదు. కష్టాలు లేని జీవితం కోసం పోరాడాల్సిందే. మరి కలత ఎరుగని నిద్ర కోసం ఏం చేయాలి? పాట వినాలి.

కరుణ లేని ఈ జగానా కలత నిదురే మేలురా...
కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే
లేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయే
నిదుర పోరా తమ్ముడా...
ఎవరైనా ఉండాలి స్నేహానికో. మాట సాయానికో. మనసుకు దగ్గరగానో. మనెద పంచుకోవడానికో. ఉండాలి ఒకరు. మనల్ని గమనించి, మన కొరకు అక్కర ప్రదర్శించి వారొక ఆలంబనగా ఉంటా పాటగా ఉంటే నిదురెందుకు రాదు?

పాడుతా తీయగా సల్లగా
పసిపాపలా నిదురపో తల్లిగా
బంగారు తల్లిగా...

సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించెనే
సడి సేయకో గాలి...
శిశుర్వేత్తి పశుర్వేత్తి... గానం విలువ అది. పసిపాపకు జోల పాడితే జోలకు మాత్రమే కాదు నిదుర పట్టేది. పెరిగి పెద్దదయ్యి జీవన లాలిత్యం ఏర్పరుచుకుంటే అందుక్కూడా నిదురపడుతుంది. గాలి తగిలే శయ్య ఉంటే సరిపోదు.. స్వీయ జీవితంలోగాని, ఎదుటివారి జీవితంలోగాని తెలిసి తెలిసి కర్కశపు చప్పుళ్లు, సద్దులూ చేయకపోతే ఆ మనసుకు తప్పక హాయిగా నిదుర పడుతుంది.

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు....

అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే
నీకన్నా నాకెవరే...
పసి పిల్లల్ని చూసినప్పుడు చిరునవ్వు మీకు రాలేదంటే మీకు నిదుర కూడా రాదు. సుకూమారమైనవి కదా కన్నులు. అంతటి సుకుమారమైన కన్నుల్లో నిదుర రావాలంటే ఎంతటి కరుణ మీలో ఉండాలి. జగతి పట్ల ఎంతటి కారుణ్యం కలిగి ఉండాలి.

ముద్దుముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు
జాజిమల్లె పూవు బజ్జోమ్మ నువ్వు...
నిదుర పట్టాలంటే స్థిమితత్వం కూడా ఉండాల్లేంటి. అంటే ఏమిటి? స్థితికి సంబంధించిన మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, చక్కటి కుటుంబం... ఇవి సరే. బాంధవ్యాలు? ఒకప్పటి బంధుత్వాలు ఇప్పుడు సన్నగిల్లిపోయాయి. తల్లిదండ్రులతో, అవ్వా తాతలతో కలిసి ఉండలేని స్థితి. పెదనాన్న, బాబాయి, మేనమామ, మేనత్త... వీరు మనకు ఉన్నారు అనే భావన కూడా మొద్దు నిద్ర పట్టడానికి మంచి టాబ్లెట్‌ ఏమో.

అత్త ఒడి పువ్వు వలే మెత్తనమ్మా
ఆదమరిచి హాయిగా ఆడుకొమ్మా
ఆడుకొని ఆడుకొని అలసిపోతివా
అలుపుతీర బజ్జొమ్మ అందాల బొమ్మ...
పిల్లల్ని బాగా పెంచుకోవాలి. ప్రేమగా అక్కున చేర్చుకోవాలి. వారి మంచి అలవాట్లు తల్లిదండ్రులకు మంచి నిద్ర. వారి పట్ల ఆర్తి, వారితో గడిపే సమయం తిరిగి మనల్ని సంతోష సమీరంగా తాకుతుంది. మన కోసం పాడి మురిపాల నిద్రను ప్రసాదిస్తుంది.

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలుకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి
జో...జో... జో...
నిదుర రావడం లేదంటే అది కేవలం భౌతిక ఆరోగ్యానికి సంబంధించిన సంగతి కాదు. మీ నిద్ర మీ అందమైన ΄÷దరింట్లో ఉంది. తప్పులకు బలహీనతలకు వ్యసనాలకు లొంగని జీవనంలో ఉంది. మీరు నిలబెట్టుకునే బాంధ్యవాల్లో ఉంది. మీ మంచి స్నేహాల్లో ఉంది. మీ కళాభిరుచుల్లో ఉంది. పిసరంత సాయగుణం... చిటికెడంత ఆర్ద్రత... ఇవి ఉంటే నిదుర మీకే తోకాడించే బుజ్జి కుక్కపిల్ల.
– కె

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)