Breaking News

Schizophrenia చికిత్సతో సరిచేయవచ్చు!

Published on Sat, 05/24/2025 - 14:12

మానవాళి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో మానసిక రుగ్మతలు ఇప్పటికీ అలక్ష్యానికి గురవుతున్నాయి. శారీరక వ్యాధులతో పోలిస్తే, స్కిజోఫ్రెనియా (Schizophrenia)  వంటి మానసిక సమస్యల గుర్తింపు, చికిత్సలో సమాజం వెనుకబడి ఉంది. అందుకే ఈ వ్యాధి గురించి ప్రజల్లో చైతన్యం పెంచడం, బాధితుల పట్ల సానుభూతి చూపడం, అపోహలు తొలగించడం వంటి ప్రధాన ఉద్దేశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 24న ‘స్కిజోఫ్రెనియా అవగాహన దినో త్సవం’ జరుపుకొంటున్నాం.  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, ప్రపంచంలో 0.3–0.7% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 1 కోటి మంది స్కిజోఫ్రెనియాతో జీవిస్తున్నట్టు అంచనా. ఈ వ్యాధిగ్రస్థులు తరచుగా భ్రమలకు లోనవు తారు. ఉదాహరణకు తనను ఎవరో హత్య చేయాలనుకుంటు న్నారని భావిస్తూ భయపడుతుంటారు. అలాగే వారికి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నట్లు, ఏవో దృశ్యాలు కనిపిస్తు న్నట్లు ఉంటుంది. సంభాషణలో అస్పష్టత ఉంటుంది.

బంధువుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం, హఠాత్తుగా కోపగించుకోవడం, చికాకుపడడం, నిరాశకు లోనవ్వడం వీరి ప్రధాన లక్షణాలు.  ఈ వ్యాధికి స్పష్టమైన ఒకే కారణం లేకపోయినా... జన్యుపరమైన సున్నితత్వం, మెదడులో రసాయన అసమ తుల్యత, బాల్యంలో జరిగిన మానసిక గాయాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి అంశాలు ఉమ్మడిగా ప్రభా వితం చేస్తాయి. మందులు (యాంటీ సైకోటిక్స్‌) వాడితే భ్రమలు వంటివి తగ్గుతాయి. ఆలోచనలను సమతుల్యం చేయడానికి తగిన మానసిక చికిత్స అందించాలి.కుటుంబం ఓర్పు, ప్రేమతో నిలబడటం బాధితుల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. స్కిజోఫ్రెనియా బాధితులు ప్రమాదకరమనీ, వారికి సాధారణ జీవితం సాధ్యం కాదనీ చెప్పే మాటలు నిజం కాదు. చికిత్స అందిస్తే వారూ మన లాగే జీవిస్తారు.  

– డా.బి. హర్షిణి (ఎమ్‌డీ, సైకియాట్రీ), ఫాదర్స్‌ ముల్లర్స్‌ మెడికల్‌ సైన్సెస్, మంగళూరు  
(నేడు ప్రపంచ స్కిజోఫ్రెనియా అవగాహన దినోత్సవం) 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)