Breaking News

World IVF Day ఎగ్ ఫ్రీజింగ్‌పై మహిళల్లో ఆసక్తి : అటు పురుషుల్లో కూడా!

Published on Thu, 07/25/2024 - 17:08

హైద‌రాబాద్:  భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని  నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ  ప‌దేళ్లు పూర్తిచేసుకుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం,  మారుతున్న‌ జీవనశైలి  లాంటివి సంతానలేమి పెరగడానికి కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్స కోసం 35 ఏళ్లు పైబడిన మహిళలు వస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22-23 సంవత్సరాలే ఉండ‌టం ఆందోళ‌న‌క‌రంగా ఉంది. అయితే, గత దశాబ్దంలో పురుషులలో సంతాన‌రాహిత్య స‌మ‌స్య‌ను అంగీకరించడంలో గణనీయమైన మార్పు క‌నిపిస్తోంది.

తెలంగాణ‌లోనూ పురుషులు, మ‌హిళ‌ల్లో సంతానరాహిత్యం పెరుగుతోంది. సంతాన‌సాఫ‌ల్య రేటు రాష్ట్రంలో త‌గ్గుతోంది. ఒక్కో మ‌హిళ‌కు స‌గ‌టున 2.1 మంది పిల్ల‌లు ఉండాలి గానీ, 1.8 మంది ఉంటున్నారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల మాట్లాడుతూ. “పదేళ్ల క్రితం కొంతమంది పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇది తీవ్రంగా మారింది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది. మహిళల్లో, అండం నాణ్యతలో తగ్గుదల గమనించినా, అడెనోమైయోసిస్ కేసులు కూడా ఉంటున్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం క‌లిగించే స‌మ‌స్య‌. ఒక దశాబ్దం క్రితం, స‌మాజానికి భ‌య‌ప‌డి సంతానసాఫ‌ల్య చికిత్‌్ల‌కు అంత‌గా ముందుకు వ‌చ్చేవారు కారు, ప్ర‌జ‌ల‌ను ఒప్పించ‌లేక‌పోయేవాళ్లం. ఇప్పుడు మా వ‌ద్ద‌కు వ‌చ్చేవారిలో 30% మంది ఈ చికిత్స‌కు ఆమోదం తెలుపుతున్నారు. ప‌దేళ్ల‌తో పోలిస్తే ఇది మంచి మార్పు. గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) లాంటి పరీక్షలను ఉపయోగించి ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆవిష్కరణలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరగడానికి దోహదపడతాయి.

సాంకేతిక పరిజ్ఞానంలో పురోగ‌తి వ‌ల్ల సంతాన‌సాఫ‌ల్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. పిల్ల‌లు పుట్ట‌ని జంట‌ల‌కు కొత్తఆశ‌, మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. దాంతోపాటు.. క్రియోప్రిజ‌ర్వేష‌న్ వ‌ల్ల ఇప్పుడు అండాలు, వీర్యం, పిండాల‌ను కూడా స‌మ‌ర్థంగా నిల్వ‌చేయ‌గ‌లుగుతున్నాం. దీనివ‌ల్ల ఎవ‌రైనా కొంత వ‌య‌సు త‌ర్వాత పిల్ల‌లు కావాల‌నుకున్నా అది సుల‌భ‌మే అవుతుంది” అని వివ‌రించారు.

నోవా ఐవీఎఫ్‌లో మ‌రో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్ట‌ర్ హిమ‌దీప్తి మాట్లాడుతూ, “సంతాన‌సాఫ‌ల్య చికిత్స‌లో సాంకేతిక‌ప‌రమైన అభివృద్ది చాలా వచ్చింది.  త‌మ జీవ గ‌డియారం గురించి, సంతాన‌సాఫ‌ల్యంలో దాని పాత్ర గురించి మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న పెరుగుతోంది. గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగేవారి సంఖ్య ఎక్కువ‌వుతోంది. ప్ర‌స్తుతం సంవత్సరానికి 50 నంచి 100 మంది దీనికోసం అడిగేందుకు వ‌స్తున్నారు.  కొన్నేళ్ల క్రితం అస్స‌లు అడిగేవారే కారు. పిల్ల‌లు త‌ర్వాత కావాల‌నుకుంటే, త‌మ అండాలు, వీర్యం, లేదా పిండాల‌ను కూడా ఫ్రీజ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంది” అని తెలిపారు.

పురుషుల సంతాన‌రాహిత్య అంగీకారంలో మార్పు
సంతాన‌రాహిత్య స‌మ‌స్య‌ల‌కు ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డంలో పురుషుల ఆలోచ‌నా విధానం గ‌ణ‌నీయంగా మారింద‌ని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతాన‌సాఫ‌ల్య నిపుణులు చెబుతున్నారు. ఒక ద‌శాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేష‌ణ చేయించుకోవ‌డానికి వెన‌కాడేవారు. పురుషుల వ‌ల్ల కూడా సంతాన‌రాహిత్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని గుర్తించ‌డానికే ఇష్ట‌ప‌డేవారు కారు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేష‌ణ విష‌యంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. త‌ద్వారా పురుషుల సంతాన‌సాఫ‌ల్య ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలతో, సంతాన సాఫ‌ల్య‌ చికిత్సలను అందించడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న‌ సమగ్ర సంతాన సాఫ‌ల్య‌ చికిత్సా కేంద్రం.


 

Videos

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)