రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!
Breaking News
World Hypertension Day : పట్టణ యువతలో పెరుగుతున్న ‘హైబీపీ’
Published on Sat, 05/17/2025 - 14:20
మే 17 ప్రపంచ రక్తపోటు దినోత్సవం (World Hypertension Day) సందర్భంగా, అపోలో హాస్పిటల్స్ దేశంలో పెరుగుతున్న రక్తపోటుపై జాతీయ అవగాహన కోసం పిలుపునిస్తోంది.ఆరోగ్యవంతులైన భారతీయులలో ప్రతీ ఇద్దరిలో ఒకరికి ముందస్తు గుండె జబ్బులు వస్తున్నాయి . దేశీయంగా యువకుల్లో దాదాపు 30శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. రక్తపోటు అనేది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం , అకాల మరణాలకు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటిగా మారింది. ప్రజారోగ్యంపై దీని గణనీయమైన ప్రభావం ఉన్నప్పటికీ, అధిక సంఖ్యలో అధిక రక్తపోటు నిర్ధారణ కావడంలేదు. దీనిపై అవగాహన పెంచుకోవాలని అపోలో హాస్పిటల్స్ ప్రజలను కోరుతుంది.
భారతదేశంలో పెరుగుతున్న ‘రక్తపోటు’
రక్తపోటు సుమారు 300 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మందికి వారికి బీపీ ఉన్నట్టు గుర్తించడం లేదు. 2024లో 45 ఏళ్లలోపు వారిలో 26శాతం మందికి మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు , ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ, “భారతదేశం అనేక ప్రజారోగ్య సంక్షోభాలను అధిగమించింది . ఇది అవగాహన సమిష్టి కృషి ద్వారానే సాధ్య ం. అపోలో హాస్పిటల్స్‌లో, నివారణ అనేది మొదటి ప్రిస్క్రిప్షన్ అని తాము నమ్ముతున్నామన్నారు. డిజిటల్ హైపర్‌టెన్షన్ పర్యవేక్షణను మెరుగుపరచడం, రొటీన్ స్క్రీనింగ్‌లకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత నివ్వడం ముఖ్యమన్నారు. ప్రతి భారతీయుడి ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షును తాము అభిలషిస్తున్నా మన్నారు.
ముఖ్యంగా ప్రధాన నగరాల్లో, హైదరాబాద్ (68%), ఢిల్లీ (65%) , చెన్నై (63%) ఎక్కువ కేసులు నమోదు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. దీర్ఘకాలిక ఒత్తిడి , కదలికలు లేని జీవితం లాంటి 'పట్టణ జీవనశైలి' గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతోంది.అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీత రెడ్డి మాట్లాడుతూ, “రక్తపోటు ఇకపై వయస్సు లేదా జన్యుశాస్త్రానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఇది యువ పట్టణ జనాభాలో నిశ్శబ్ద అంటువ్యాధిగా మారుతోంది. నిజమైన సవాలు రక్తపోటును లెక్కించడంతోపాటు, వ్యక్తి విస్తృత హృదయనాళ ప్రమాద ప్రొఫైల్‌ను అర్థం చేసుకోవడంలో ఉంది. బయోమార్కర్లపై సమగ్ర అవగాహనను స్వీకరించాలి, ఎందుకంటే తేలికపాటి అసమతుల్యతలు కూడా మరింత తీవ్రమైన అంతర్లీన పరిస్థితులకు ప్రారంభ సూచికలు కావచ్చు అని ఆమె తెలిపారు. అంతేకాకుండా, వేగవంతమైన పట్టణీకరణతో, నిశ్చల జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు , నిరంతర ఒత్తిడి లాంటివన్నీ ప్రజారోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. నివారణ , ముందస్తు జోక్యం అనేది తప్పనిసరి. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతదేశంలోని పట్టణ జనాభాలో దాదాపు 30శాతం అధిక రక్తపోటు లేదా ప్రీ-హైపర్‌టెన్షన్ బారిన పడటం ఆందోళనకరమైంది. మన తోటి పౌరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆరోగ్య సంరక్షణ, విధానం ,సమాజ అవగాహనతోపాటు, త క్షణ సమిష్టి చర్య అవసరమని ఆమె చెప్పారు.
నివారణ మార్గాలు
ఉప్పు తీసుకోవడం తగ్గించడం, శారీరక శ్రమను పెంచడం ,ఒత్తిడి నిర్వహణ వంటి సాధారణ జీవనశైలి మార్పుల ద్వారా అధిక రక్తపోటు వల్ల కలిగే 80శాతం గుండెపోటులు, స్ట్రోక్‌లను నివారించవచ్చని ఆధారాలు చూపిస్తున్నాయి.
అధిక రక్తపోటు వైద్య నిర్వహణ చాలా కీలకమైనప్పటికీ, అపోలో హాస్పిటల్స్ నివారణ ఆరోగ్య సంరక్షణ వైపు మార్పు కోసం వాదిస్తోంది. అధిక రక్తపోటు పెరుగుతున్న భారాన్ని తిప్పికొట్టడానికి కీలకం ఏమిటంటే, వ్యక్తులు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, సమస్య ముదరకముందే గుర్తించడం. అపోలో హాస్పిటల్స్ దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో సాంకేతికతను సమగ్రపరచడానికి రక్తపోటును గుర్తించడం , నిర్వహించడం మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్ , టెలిమెడిసిన్‌లో పురోగతి ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.
జాతీయ చర్యకు పిలుపు: సమిష్టి బాధ్యత
హృదయ సంబంధ నివారణపై జాతీయ పునరాలోచన కోసం అపోలో పిలుపునిస్తోంది, భారతీయులు ముందుగానే స్క్రీనింగ్‌లను ప్రారంభించాలని, ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారికి స్క్రీనింగ్‌లను ప్రారంభించాలని కోరుతోంది. కరోనరీ కాల్షియం స్కోరింగ్ వంటి అధునాతన ఇమేజింగ్ పద్ధతులను చేర్చడం వల్ల పైకి కనిపించని కారణాలను బహిర్గతం చేయడంలో సహాయపడుతుంది. ప్రారంభ గుర్తులను చూపించేవారికి నివారణ చికిత్సా వ్యూహాలను అవలంబించడం వల్ల, అవి లక్షణరహితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వచ్చే సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. ప్రారంభ దశలోనే అథెరోస్క్లెరోసిస్ ఉన్న వ్యక్తులు మార్గదర్శకాల ఆధారిత జోక్యాలను పొందినప్పుడు హృదయ సంబంధ సంఘటనలలో 45–50శాతం తగ్గింపు ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అధిక రక్తపోటును ముందుగా గుర్తిస్తే.. నియంత్రణ సాధ్యమే: ఆలివ్ ఆసుపత్రి
బీపీ చెక్ చేసుకుంటున్నారా? పాణాలు హరించడంలో బీప సలెంట్ కిలర్ - వరల్ బీడీ డే సందర్భంగా ఆలివ్ హాస్పిటల్ అవగాహన
ప్రాణాలను హరించడంలో రక్తపోటు సైలెంట్ కిల్లర్ అని హదరాబాద్ లోని ఆలివ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. . 17 అంతర్జాతీయ రక్తపోటు దినం సందర్భంగా గుండె సంబంధిత వ్యాదులపై ఆసుపత్రి నిర్వాహకులు అవగాహన కల్పించారు. రక్తపోటు గుర్తింపు, నియంత్రణ, నివారణ లాంటి అంశాలపై అవగాహనా కార్యక్రామాన్ని నిర్వహించారు. రక్తపోటు ద్వారా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై అవగాహనా ఆవశ్యకతపై వివరించారు. ‘రక్తపోటును సరిగ్గా గుర్తించండి, నియంత్రించుకుంటూ ఎక్కువకాలం జీవించండి’ అనే థీమ్ దీనిపై చర్చించారు. రక్తపోటు దేశంలో తీవ్ర ప్రజారోగ్య సమస్యగా మారుతోందని, ముఖ్యంగా గుండె సంబంధిత, వ్యాధులు, మూత్ర పిండాల వైఫ్యలానికి కీలకమైన ప్రమాదకారంగా మారుతోందన్నారు నిపుణులు.
ఇదొక అంటువ్యాధిలా ఉందనీ, దాదాపు 200 మిలియన మంద దీనితో బాధపడుతున్నారనీ, డియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గణాంకాలు చెబుతుండగా, ఇందులో కొంతమందిలో ఇది అదుపులో ఉంది. అలాగేఏ జర్నల్ ఆఫ్ హ్యూమన్ హైపర్‌టెన్షన్‌లో ఇటీవల పచురితమన ఒక అధ్యయనం పకారం, భారతీయ పెదలలో 22.6శాతం మంది అధిక రక్తపోటుతొ బాధపడుతున్నారు. అయితే ఇందులో 15 శాతం మందిచి నియంత్రణలో ఉంది.
గుండెపోటు, లేదా గుండె వైఫల్యం చివరి దశలో, సమస్య తీవ్రమైనపుడుమాత్రమే రోగులు వైద్య కోసం వస్తున్నారని ఆలివ్ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెనల్ కార్డియాలజిస్ట్ డా. జహెదుల్లా ఖాన్ విచారం వ్యక్తంచేశారు. ఈ సమస్యను ముందుగాగుర్తించినా, లేదా క్రమం తప్పకుండా చికిత్సతీసుకున్నా, ప్రమాదకరమైన, అత్యవసర పరిస్థితులు రావని సూచించారు. ఈ సందర్భంగా ఆలివ్ హాసి్పటల్ లోని కన్సలెంట్ ఇంటర్వననల్ కారయాలజిస్ డాకర్ జహెదులా ఖాన్ మాటాడుతూ, “క్రమం తప్పకుండా బీపీని చెక్ చేసుకుంటూ ఉంటే నియంత్రణ సాధ్యమన్నారు. లక్షణాల కోసం చూడకుండా అవగాహన పెంచుకొని, తీసుకునే నివారణ చర్యలే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయుధమన్నారు.
జాగ్రత్తలు
అధిక రక్తపోటు ఎలాంటి లక్షణాలు లేకుండా ముదిరిపోతుంది. అందుకే పతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసార బీపీ చెక్ చేసుకోవటం అలవాటుగా మార్చుకోవాలి.సమతుల్య, తక్కువ సడియం ఆహారం, అధిక పటాషియం ఉండేలా ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. శారీరకంగా చురుకుగా ఉండటంతోపాటు ఒత్తిడిని నియంతించుకోవాలి. సరైన చికిత్సతో అధిక రక్తపోటును కట్టడి చేయవచ్చు.
Tags : 1