తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా

Published on Sat, 05/04/2024 - 13:49

ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి.  మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది.  ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి
సుమత్రన్‌ ఒరాంగుటాన్స్‌ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్)‌ తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో  ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్‌ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బిహేవియర్‌ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.

సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని  ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్‌. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో  వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు  గుర్తించడం విశేషం.

ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే  తొలిసారి అని జర్మనీలోని కాన్‌స్టాంజ్‌లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్‌, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు.  కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్‌ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)