Breaking News

పర్యావరణ హితమైన క్లీనింగ్‌ ప్రొడక్ట్స్‌నే ఉపయోగిద్దాం ..!

Published on Thu, 06/05/2025 - 09:08

పర్యావరణానికి మేలు చేయడానికి చిన్న చిన్న అడుగులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. రోజువారీగా మన ఇళ్లలో... గిన్నెలు శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి, ఫ్లోర్‌ తుడవడానికి, వాష్‌ రూమ్‌లు, గాజు పరికరాలు శుభ్రం చేయడానికి... ఉపయోగించే క్లీనర్స్‌ సువాసన రావడానికి ఎయిర్‌ ప్రెషనర్స్‌.. అంటూ రకరకాల రసాయన ఉత్పత్తులను వాడుతుంటాం. శుభ్రత మాట ఎలా ఉన్నా ఇవన్నీ పర్యావరణానికి హానిచేసేవే ఉంటాయి. వ్యర్థాల నుంచి తిరిగి ఉపయోగించేలా వస్తువుల తయారీ ఎంత ముఖ్యమో, ఇంటి శుభ్రతలో రసాయనాలు లేని ఉత్పత్తుల వాడకమూ అంతే ముఖ్యం. 

ఆల్‌ పర్సప్‌ క్లీనర్స్‌...
దినచర్యలో భాగంగా వంటగది, బాత్రూమ్‌.. ఇంటిలోని ప్రతి భాగాన్ని శుభ్రం చేయడానికి పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి. 

వెనిగర్‌లో బాక్టీరియా నశింపజేసే గుణం ఉంటుంది. కిచెన్, గ్లాస్, బాత్‌రూమ్‌ క్లీనర్‌గానూ పనిచేస్తుంది.

వంటలలో వాడే బేకింగ్‌ సోడాను ఇంటి శుభ్రతలోనూ వాడచ్చు. మరకలు తొలగించడానికి, దుర్వాసన పోగొట్టడానికి నీటిలో కలిపి ఉపయోగించవచ్చు.  

నిమ్మరసంలో యాసిడ్‌ గుణం ఉండటం వల్ల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. కూరగాయలు కట్‌ చేసే బోర్డ్స్, మెటల్‌ పాలిష్‌ రిమూవర్‌కి నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. 

ఇంట్లో మంచి పరిమళాలు రావడానికి సుగంధనూనెలను ఉపయోగించవచ్చు. ఈ నూనెలలో యాంటీబాక్టీరియల్‌ గుణాలు కూడా ఉంటాయి

ఫ్లోర్‌ క్లీనర్‌గా 5 లీటర్ల నీటిలో అర కప్పు వెనిగర్‌ + స్పూన్‌ బేకింగ్‌ సోడా + కొన్ని చుక్కల ట్రీ ట్రీ ఆయిల్‌ కలిపి ఫ్లోర్‌ను తుడవాలి. ఫ్లోర్‌పై ఉన్న మరకలు, బాక్టీరియా శుభ్రపడుతుంది. 

ఆల్‌ పర్పస్‌ క్లీనర్‌ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. కప్పు వెనిగర్‌ + కప్పు నీరు + 10 చుక్కల నిమ్మ నూనె  స్ప్రే బాటిల్‌లో కలిపి, గ్లాస్, కిచెన్‌ కౌంటర్‌లపై స్ప్రే చేసి, తుడవాలి. బాక్టీరియా దరిచేరదు. చక్కగా శుభ్రపడతాయి.

ఆత్మీయ నేస్తం 
పర్యావరణ ముప్పుకు చెక్‌ పెట్టే అతి పెద్ద రక్షణ ‘చేతి సంచి. యూజ్‌ అండ్‌ థ్రో ΄ాలిథిన్‌ కవర్ల వాడకాన్ని తగ్గించడానికి క్లాత్‌తో లేదా జ్యూట్‌తో చేసిన సంచులను ఉపయోగించవచ్చు. 

సొంతంగా క్లీనింగ్‌ ప్రొడక్ట్స్‌
గిన్నెలు కడగడానికి లిక్విడ్‌ డిష్‌ వాషర్‌కి షీకాకాయ, కుంకుడుకాయ పొడి, లెమన్‌పీల్‌ పౌడర్, ఉప్పు, బూడిద కలిపి మిశ్రమం తయారుచేసి, దానినే ఉపయోగిస్తాను. ఆరెంజ్‌ పీల్, నీళ్లు, బెల్లం కలిపి ఒక పాత్రలో పోసి 3–4 నెలల పాటు అలాగే ఉంచుతాను. ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి స్పూన్‌తో కలుపుతాను. ఆ మిశ్రమాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి, ఫ్లోర్‌ తుడవడానికి ఉపయోగిస్తాను. అలాగే, వాషింగ్‌ మెషిన్‌ లిక్విడ్, బాత్రూమ్‌ క్లీనింగ్‌ లిక్విడ్‌కి కుంకుడు కాయల నుంచి రసం తీసి ఉపయోగిస్తాను. 

ఒంటి శుభ్రతలోనూ సహజ ఉత్పత్తులనే ఉపయోగిస్తాను. దుస్తులకు డై చేయడంలో సహజసిద్ధమైన పద్ధతులనే ఎంచుకుంటాను. వీటి తయారీకి కొంత సమయం పడుతుంది. కానీ, పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులను వాళ్లు దోగాడటం నుంచి ఉపయోగిస్తున్నాను. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ నుంచి ఎకో ప్రింటింగ్‌ వైపుకు నా ఆలోచనను మార్చుకున్నది కూడా పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీలో భాగం అవ్వడం కోసమే. 
– సవిత అలంపల్లి, ఎకో ప్రింటర్, కిస్మత్‌పుర, హైదరాబాద్‌

(చదవండి: జస్ట్‌ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ)

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు