Breaking News

తల్లిపాల వారోత్సవాలు : బాధ్యత మనందరిదీ!

Published on Thu, 08/01/2024 - 11:50

నవమాసాలు మోసి బిడ్డను కనిపెంచడంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది. అలాగే తల్లి పాలల్లో మహత్తర శక్తి  ఉంది. పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యమివ్వడం చాలా అవసరం. దీనిపై అవగాహన కల్పించేందుకే  ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు 120కి పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటారు. పిల్లల  సక్రమమైన అభివృద్ధికి తల్లిపాలు చాలా అవసరం. బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడం మాత్రమేకాదు, తల్లీబిడ్డల బాంధవ్యాన్ని పెంచుతుంది. పసివయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది. మొదటి టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు.  

1992లో మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్‌ ప్రతిపాదను ఆమోదం లభించింది.1990లో ఆగస్టులో  ప్రభుత్వ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ , ఇతర సంస్థలచే తల్లిపాలను రక్షించడానికి, ప్రోత్సహించడానికి , మద్దతు ఇచ్చేలా ఇన్నోసెంటి డిక్లరేషన్‌పై సంతకాలు జరిగాయి.  తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, దానికి మద్దతు ఇవ్వడం , ప్రోత్సహించడంతో పాటు  ప్రతిచోటా తల్లులు  శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని  ప్రధాన లక్ష్యాలు.

ప్రతీ ఏడాది, ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ డేని వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ (WABA) ఎంపిక చేసిన కొత్త థీమ్‌తో జరుపుకోవడం ఆనవాయితీ. “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” (Closing the gap: Breastfeeding support for all) అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  


తల్లిపాలు ప్రాముఖ్యత , ప్రయోజనాలు
నవజాత శిశువులకు తల్లి పాలు బలవర్ధకమైన పోషకాహారం. అనేక రకాల సాధారణ వ్యాధులనుంచి రక్షించే రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. తల్లిపాలలోని పోషకాలు, యాంటీబాడీస్‌,ఎంజైమ్‌లు పిల్లల్ని అనారోగ్యాలు ,ఇన్ఫెక్షన్ల నుండి  కాపాడతాయి.

తల్లి-పిల్లల బంధాన్ని బలోపేతం చేయడం, ప్రసవానంతరం బాలింతలు వేగంగా కోలుకోవడానికి, రొమ్ము, అండాశయ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లి పాలు ఏంతో మేలు చేస్తాయి. 

ఒక కొత్త జీవిని ఈ సమాజంలోకి తీసుకొచ్చే ఈ ప్రయాణంలో అమ్మకు మనం అందరంఅండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకొని అటు భర్త, ఇటు ఇరు కుటుంబ సభ్యులు ఆమె తోడుగా నిలవాలి.  అలాగే  కమ్యూనిటీ స్థాయిలో రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య సంస్థలు అధికారులు ఇందుకు మద్దతుగా నిలబడాలి. ఈ అవగాహన పెంచేందుకు,తల్లులు ఎదుర్కొంటున్ ఇబ్బందులను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్‌లు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌ల ద్వారా కృషి చేస్తారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)