Breaking News

ఉమెన్‌ సివిల్‌ పవర్‌

Published on Tue, 03/10/2026 - 02:11

ఒకప్పుడు... ‘సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్‌ లో సత్తా చాటుతున్నారు...

24 - 35%: ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌లో మహిళలప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.
41%: 2023 ఐఏఎస్‌ బ్యాచ్‌లో రికార్డ్‌ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.
18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.

అసామాన్య విజేతలు
ఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్‌సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. 
డాక్టర్‌ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్‌కు చెందిన అథిరా మగతన్‌ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడి΄ోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్‌లో ఆమె 483 ర్యాంక్‌. 
పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. 

పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్‌దీప్‌ కౌర్‌ యూపీఎస్‌సీలో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 15 సాధించింది. కౌర్‌ తండ్రి సామాన్య రైతు. 
కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్‌ శ్రీజ చిన్న స్టడీ రూమ్‌లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్‌లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ సాధించడానికి ఆ కొటేషన్‌లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌. తల్లి సాధారణ గృహిణి. 

⇒  గుజరాత్‌లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్‌ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్‌ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. ∙పంజాబ్‌లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్‌దీప్‌ కౌర్‌ మొదటి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్‌  సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్‌సింగ్‌ పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్‌ కౌర్‌ గృహిణి.

⇒ మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్‌ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్‌సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్‌.

Videos

10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే

పరకామణిలో బంగారం చోరీ కేసు.. BR నాయుడు ఇప్పుడు మాట్లాడు!

మల్లంపేట నుంచి బాచుపల్లి కనెక్టింగ్ పేరుతో రోడ్డు నిర్మాణం

అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫైట్ అసలు కారణం ఇదే..

టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు

మీకు 17 వరకు టైం ఇస్తున్న.. జడ శ్రవణ్ వార్నింగ్..

రోగులను గాలికొదిలేసి.. ఐటెం సాంగ్ కు నర్సుల డ్యాన్స్

మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్

టెహ్రాన్‌పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం

AP: తిరుమల వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా ఇందాపూర్ డైరీదేనా?

Photos

+5

'లేచింది మహిళా లోకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)

+5

కాబోయే భార్యని పరిచయం చేసిన హీరో బెల్లంకొండ (ఫొటోలు)

+5

చీరలో పవర్‌‌ఫుల్‌గా హీరోయిన్ ధన్సిక (ఫొటోలు)

+5

సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్‌‌ హైలైట్స్‌.. (ఫొటోలు)

+5

టీ–20 వరల్డ్‌ కప్‌ : హైదరాబాద్ లో క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

'మృత్యుంజయ్' థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)