Breaking News

ఇంతై..ఇంతింతై..! సందిడిగా సాక్షి 'ఆల్‌ ఫర్‌ హర్‌'

Published on Mon, 03/09/2026 - 15:55

‘ఇంతింతై.. వటుడింతయై’ పోతన భాగవతంలోని వామనావతార ఘట్టానికి చెందిన ప్రసిద్ధ పద్యం తెలిసిందే.. వామనుడు విశ్వరూపం దాల్చి భూమి, ఆకాశం, నక్షత్రలోకాలను ఆక్రమించిన దృశ్యాన్ని ఈ పద్యం వరి్ణస్తుంది.. అలాగే సమాజాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న మహిళా శక్తి కీర్తి ప్రతిష్టలు ఇంతై.. ఇంతింతై.. అన్నట్లు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఓ వైపు కుటుంబాన్ని నడిపించే శక్తిగా, మరోవైపు ప్రతి రంగంలోనూ ప్రతిభను చాటుతూ ఇంతులు కొత్త కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్నారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ సాధికరాతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘సాక్షి’ గ్రూప్‌ మరో ముందడుగు వేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆల్‌ ఫర్‌ హర్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.  

హైదరాబాద్‌లోని రాజపుష్ప అట్రియా వేదికగా జరిగిన వేడుకలు మహిళల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, స్వయం అభివృద్ధి సందేశాన్ని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్‌ ఆరి్టస్ట్‌ తమన్నా రూజ్‌ మేకప్‌ మాస్టర్‌ క్లాస్‌ సెషన్‌ ప్రత్యేక ఆకర్షణ కాగా..ఈ సెషన్‌లో మహిళలకు ట్రెండీ మేకప్‌ పద్ధతులు, సేఫ్టీ మేకప్‌ టెక్నిక్స్, స్కిన్‌ కేర్‌ సంబంధిత సూచనలు అందించారు. 

తమన్నా రూజ్‌ హైదరాబాద్‌లో మేకప్‌ స్టూడియోను ప్రారంభించిన తొలి మేకప్‌ ఆరి్టస్ట్‌గానే కాకుండా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేకప్‌ నుంచి పట్టభద్రురాలు.. రష్యా, లెబనాన్, దుబాయ్‌ వంటి పలు దేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. రాజపుష్ప అట్రియా అసోసియేషన్‌ సభ్యులతో పాటు కమ్యూనిటీకి చెందిన మహిళలు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

సాధికారత..సమన్వయం.. 
మహిళల ఆత్మవిశ్వాసం, స్వీయ సాధికారత ప్రదర్శించేలా నిర్వహించిన ‘ఫేస్‌ ఆఫ్‌ సాక్షి కమ్యూనిటీ’ క్రౌన్‌ సెర్మనీ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా సూపర్‌ మామ్‌ క్రౌన్‌ను మధు, బ్యాలెన్సింగ్‌ చాంప్‌ కిరీటాన్ని సంగీత, గ్రేస్‌ ఫుల్‌ సీనియర్‌ లేడీ క్రౌన్‌ను సుమతి గెలుచుకున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాప్‌ డ్యాన్స్‌ యాక్టివిటీలో మహిళలు ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం ఉమెన్స్‌ డే కేక్‌ కట్టింగ్‌ చేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు జోయాలుక్కాస్‌ జ్యువెల్స్‌ ప్రోత్సాహక బహుమతులు 
అందించారు. 

పాఠకులతో సాక్షి మమేకం.. 
సాక్షి మీడియా గ్రూప్‌ 18 సంవత్సరాలుగా ప్రజలకు, పాఠకులకు కొత్త ఆలోచనలు, కొత్త ఫార్మాట్లను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని, సమాజంతో మమేకమవుతూ ప్రజలతో సాన్నిహిత్యాన్ని బలోపేతం చేయడం సాక్షి గ్రూప్‌ లక్ష్యమని సంస్థ డైరెక్టర్‌ రాణీ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే మహిళలతో నేరుగా కలిసేందుకే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

వ్యక్తిత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌.. 
నేటి తరం మహిళల్లో అందంగా కనబడాలనే ఆసక్తి పెరుగుతోందని తమన్నా రూజ్‌ పేర్కొన్నారు. సాక్షి టీవీతో ప్రత్యేక అనుబంధం ఉన్న తాను మేకప్‌ ఆర్టిస్ట్‌ కెరీర్‌కు ముందు ‘సాక్షి’ టీవీలో పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. సెల్ఫ్‌ మేకప్, సెల్ఫ్‌ గ్రూమింగ్‌ పట్ల అవగాహన కల్పించడమే ఈ సెషన్‌ లక్ష్యమని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారని, మహిళల దైనందిన జీవితంలో అందం, వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని అన్నారు. 

మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. నేటి తరం పురుషుల ఆలోచనా విధానంలో మార్పువచి్చందని, అమ్మ, భార్య, చెల్లి, ఇలా కుటుంబంలోని మహిళలను వారు ఎన్నుకున్న రంగంలో ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. నగరంలో బ్యూటీ రంగం ఎంతో మార్పు చెందిందని, ముఖ్యంగా దక్షిణ భారత సమాజంలో మేకప్‌పై ఉన్న సంప్రదాయ భావనలు క్రమంగా మారుతున్నాయని పేర్కొన్నారు.

వెల్‌ డన్‌ ‘సాక్షి’.. 
ఉమెన్స్‌ డే రోజున సాక్షి ఆధ్వర్యంలో మా కోసం స్ఫూర్తివంతంగా నిర్వహించిన ఈ ‘ఆల్‌ ఫర్‌ 
హర్‌’ వేడుకలు అభినందనీయం. ఈ వేడుకలు మా అందరికీ సరికొత్త అనుభూతిని, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందించిన సాక్షి గ్రూప్‌కు ప్రత్యేక అభినందనలు.  
– జానకి (పార్టిసిపేషన్‌ ప్రైజ్‌ విన్నర్‌)   

(చదవండి: వసంతాన్ని ఎక్స్‌పీరియెన్స్‌ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!)

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)