Breaking News

తొలి మహిళా పెట్రోల్‌ బంక్‌: 'స్త్రీశక్తి... ఇంధనమై'..

Published on Tue, 02/25/2025 - 00:23

‘పెట్రోల్‌ బంక్‌లో మహిళలు ఉద్యోగం చేయగలరా!’ అనే పురుషాధిపత్య అనుమానాన్ని పటాపంచలు చేస్తూ... ‘బ్రహ్మాండంగా చేయగలరు’ అని నిరూపించారు మహిళలు.ఇప్పుడు ఆ దారిలో మరో ముందడుగు... తొలి మహిళా పెట్రోల్‌ బంక్‌. ఇద్దరు కలెక్టర్‌ల చొరవ, కృషితో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు ఏర్పాటు అయింది...

నారాయణపేట జిల్లాలో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వచ్చింది. ‘మీరు ముందుకు వస్తే పెట్రోల్‌ బంకును ఏర్పాటు చేయిస్తాను’ అని హామీ ఇచ్చారాయన. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. డీఆర్‌డీఏ కార్యాలయానికి అనుకొని ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ భూమిని డీఆర్‌డీఏ, జడ్‌ఎంఎస్‌ పేరిట రిజిస్ట్రేషన్  చేయించి బీపీసీఎల్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.  కలెక్టర్‌  బదిలీపై వెళ్లడంతో ‘అయ్యో!’ అనుకున్నారు. పెట్రోల్‌ బంక్‌ కల సాధ్యం కాదు అనుకున్నారు.

అయితే ప్రస్తుత కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌  ఫైల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోనే తొలి మహిళ పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. 35 వేల లీటర్ల (పెట్రోల్, డిజిల్‌) నిల్వ సామర్థ్యం ఉండే ఈ బంకు 24 గంటలు పనిచేస్తుంది. బంకు నిర్వహణ ద్వారా వచ్చే కమిషన్  జిల్లా సమాఖ్యకు చేరుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా రూ.10 వేలు బీపీసీఎల్‌ మహిళా సమాఖ్యకు అందిస్తుంది. బంకు నిర్వహణ ద్వారా 10 మంది మహిళా సభ్యులకు ఉపాధి లభించనుంది. 
ఈ పెట్రోల్‌ బంక్‌ దగ్గరికి వచ్చిన ఒకాయన ఇలా అన్నాడు.... ‘ఎంతైనా ఆడవాళ్ల ఓపికే వేరు’ పెట్రోల్‌ బంక్‌ను విజయపథంలో నడిపించడంలో ఆ ఓపిక, ఉత్సాహం, శక్తిసామర్థ్యాలు వారికి ఇంధనంగా మారాయి.

కలలో కూడా ఊహించలేదు
నారాయణపేటలో మహిళ సంఘం ద్వారా పెట్రోల్‌ బంకును ఏర్పాటు చేసుకుంటామని కలలో కూడా ఊహించలేదు. ఇది అయ్యే పని కాదనుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో బంకు ఏర్పాటు కావడం, అందులో సేల్స్‌ ఎగ్జిక్యూటిగా ఉద్యోగంలో చేరడం సంతోషంగా ఉంది. నెలకు రూ.11 వేల జీతం వస్తుంది. కుటుంబానికి ఎంతో అండగా ఉండేందుకు తోడ్పడుతుంది.
– జగదీశ్వరి, సెల్స్‌ ఉమన్ , జడ్‌.ఎం.ఎస్‌. పెట్రోల్‌ బంకు 

మరింత మందికి ఉపాధి
నారాయణపేట జడ్‌ఎంఎస్‌ అధ్యక్షురాలిగా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నా. జడ్‌ఎంఎస్‌కు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా, స్త్రీనిధి కింద వచ్చే ఆదాయంతో నెట్టుకొచ్చేవాళ్లం. పెట్రోల్‌ బంక్‌ రూపంలో అదనపు ఆదాయం రావడంతో మరింత మంది ఉపాధి అవకాశాలకు వీలైంది.
– చంద్రకళ, పెట్రోల్‌ బంకు మేనేజర్‌

– కలాల్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్, సాక్షి, నారాయణపేట

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)