Breaking News

శ్రమశక్తికి ‘సలాం’...

Published on Tue, 05/26/2026 - 05:31

‘కష్టం వస్తే కాడిపట్టగల.. అవసరమైతే గన్నీ సంచులూ మోయగలం. ఇల్లు అలకడం వంట చెయ్యడమే కాదు.. సమాజం కష్టాల్లో ఉంటే ఆదుకోవడమూ మాకు తెలుసు’ అంటూ మగవారికే పరిమితం అనుకున్న హమాలీ పనిలోనూ తాము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మహిళలు. 

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పెద్దంపేట్, ధర్మారం మండలం కమ్మర్‌ఖాన్ పేట గ్రామాల్లో ఒక అద్భుతం జరిగింది. మబ్బుపట్టిన ఆకాశాన్ని చూసి ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనన్న రైతుల ఆందోళనను చూస్తూ ఆ గ్రామ మహిళలు చేతులు ముడుచుకుని కూర్చోలేక పోయారు. 

‘మగవారే చేయాలి అనే పని ఏదీ లేదు.. రైతు కష్టం మా కళ్లముందే వృథా కాకూడదు’ అంటూ ఇంటి పనులకే పరిమితమయ్యే ఆ చేతులు.. ఒక్కసారిగా గన్నీ సంచులను అందుకున్నాయి. శ్రమను నమ్ముకున్న ఆ భుజాలు.. క్వింటాళ్ల కొద్దీ ధాన్యం బస్తాలను మోసేందుకు సిద్ధమయ్యాయి. 

మండుటెండను, అకాల వర్షపు ముప్పును లెక్కచేయకుండా, ఒకరు గన్నీసంచుల్లో ధాన్యం నింపుతుంటే.. వాటిని మోసి తూకం వద్దకు తీసుకెళ్లడం, వరుసగా పేర్చడం వంటి పనులు చేస్తూ రైతులకు భరోసానిస్తున్నారు. పనికి ఫలితంగా క్వింటాకు రూ.25 చొప్పున వేతనం అందుకుంటున్నారు. సాధారణంగా మగవారే చేయగలరని భావించే అత్యంత కష్టమైన హమలీ పనిని, ఆ మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఐకమత్యంతో చేసి చూపించారు. 

మండుటెండైనా చెమటలు కారుతున్నా అలసట ముంచుకొస్తున్నా వారి అడుగులు ఆగలేదు. అన్నదాత ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో వారు హమాలీలుగా మారిపోయారు. సమాజం తరచూ మహిళలను ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసే భావనను ఆ మహిళలు చెదరగొట్టారు. వారు కేవలం గన్నీ సంచులు మాత్రమే మోయలేదు. మహిళలపై ఉన్న అపోహలను కూడా తమ భుజాలపై మోసి దూరంగా విసిరేశారు. వారి ఐకమత్యం చూసి రైతులు ‘‘మా ధాన్యం కాపాడారు మా కష్టం వృథా కాకుండా చేశారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

హమాలీల కొరతతో...
మా ఊర్లోని కొనుగోలు కేంద్రంలో హమాలీ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు చూడలేక కొంతమంది మహిళలం రెండు గ్రూప్‌లుగా మారి ధాన్యాన్ని బస్తాల్లో నింపడం, నింపిన బస్తాలను కాంటా వేయటం, కాంటా వేసిన బస్తాలను ఒక క్రమపద్ధతి లో అమర్చటం చేస్తున్నాం. ఇందుకు రైతులు క్వింటాకు రూ.25 రూపాయలు ఇస్తున్నారు. దీంతో మాకు ఉపాధి దొరుకుతుంది. రైతులకు మేలు జరుగుతుంది.
– బోయిని లక్ష్మి, పెద్దంపేట


రైతన్నలకు ఆసరాగా...
బెంగాల్‌ ఎన్నికలకు హమాలీలు పోవడంతో, వడ్లు, మొక్కజొన్న పంట కాటా వేయటంలో జాప్యం జరుగుతోంది. దీంతో మావాడ కట్టు వాళ్లం అందరం కలిసి గ్రూప్‌గా ఏర్పడి కాంటా వేయడం లాంటి పనులు చేస్తున్నాం. మేము జోకిన బస్తాలను మగ హమాలీలు లారీల్లో లోడ్‌ చేస్తారు. దీంతో సమయం కలిసి వచ్చి రైతన్నలకు ఆసరా 
అవుతుంది. 
– దబ్బెట స్వప్న, పెద్దంపేట

ఎండ రాకముందే...
అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉండటంతో హమాలీల సేవలు సరిపోక, ధాన్యం కాంటా వేయటానికి జాప్యం జరుగుతోంది. దీంతో మేమే హమాలీలుగా అవతారమెత్తాం. ఎండరాకముందే ఉదయం 11 లోపు తూకం వేసి కాంటాలు పెడుతున్నాం. పురుషుల ప్రొత్సాహంతోనే రైతులకు ఆసరాగా నిలుస్తున్నాం.
– మానుక భీమక్క, పెద్దపేట 

– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి
ఫోటోలు: మర్రి సతీష్‌ రెడ్డి

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)