Breaking News

ఆస్పత్రిలో ప్రసవ వేదనతో ఉండగా భూకంపం.. పాపం ఆ మహిళ..!

Published on Sat, 03/29/2025 - 14:38

సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్‌ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. 

థాయ్‌లాండ్‌, మయన్మార్‌లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. 

సరిగ్గా థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్‌లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. 

భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల​ ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్‌లు, వీల్‌చైర్‌లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చి పార్క్‌లోనే డెలివిరీ చేశారు. 

ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.  ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. 

 

(చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)