నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్‌ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
Published on Fri, 11/08/2024 - 09:55
నెమ్మదిగా చలి ముదురుతోంది. వెచ్చని దుప్పట్టు, చలిమంటలు కాస్త ఊరటనిచ్చినా ఇంకా అనేక సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతగాలులకు శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు బాగా కనిపిస్తాయి. మరి ఈ సీజన్‌లో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇదిగో మీ కోసం ఈ చిట్కాలు.
పొడి బారే చర్మానికి మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా, చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
- పాల మీగడలో తేనె కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.చలికాలం రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి కూడా పెరుగుతుంది.
- చర్మానికి సరైన పోషణ లేక లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, బాగా మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి.
- జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్ కలిపి రాసుకోవచ్చు. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి.
- చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి.
- రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.
- శీతాకాలంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటేనే మెరుస్తూ ఉంటుంది. అలా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)
- ఫ్యాటీఫుడ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, సీ విటమిన్ లభించే పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
- రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ముఖంలో చర్మకాంతిలో చక్కటి గ్లో వస్తుంది.
#
Tags : 1