Breaking News

సుదీర్ఘ రాత్రికి కారణమేమిటి?

Published on Sat, 12/21/2024 - 13:27

ఈ ఏడాది డిసెంబర్‌ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.

సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.

సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్‌ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.

చ‌ద‌వండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!

అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

– చార్వాక, సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)