Breaking News

హిమపర్వం ఆగడం బగడం

Published on Sun, 01/26/2025 - 05:52

మంచు కురిసే శీతకాలం ఎంత సరదాగా ఉంటుందో ప్రపంచానికి చూపించడంలో అమెరికావాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే మిన్నెసోటా రాష్ట్రం, సెయింట్‌ పాల్‌ నగరంలో ప్రతి ఏడాది పది రోజుల పాటు ఈ ‘వింటర్‌ కార్నివాల్‌ ఉత్సవాలు’ జరుగుతాయి. ఇవి అత్యంత పురాతనమైన సంబరాలు.

సెయింట్‌ పాల్‌ను 1885లో సందర్శించిన న్యూయార్క్‌ విలేఖరులు ‘ఈ సెయింట్‌ పాల్‌ నగరం మరో సైబీరియా లాంటిది. శీతకాలంలో మానవ నివాసానికి పనికిరాదు’ అని పత్రికల్లో రాశారు. ఆ రాతలకు సెయింట్‌ పాల్‌ వాసులు మనస్తాపం చెందారు. తమ ప్రాంతం గొప్పదనాన్ని ప్రపంచానికి వెల్లడించడానికి, ప్రపంచంలో తమదైన ప్రత్యేకతను నిలుపుకోవడానికి ఈ వినూత్న సంబరాలను మార్గంగా ఎన్నుకున్నారు. 

అప్పటికే కెనడాలోని మాంట్‌రియల్‌ నగరంలో ఈ కార్నివాల్‌ ఉత్సవాలు జరుగుతుండేవి. వాటిని ప్రేరణగా తీసుకుని, 1886లో ఈ ఉత్సవాలకు నమూనాలు రూపొందించారు. ఇవి ప్రారంభమైన నాటి నుంచి కేవలం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తప్ప, ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఈ ఏడాది జనవరి 25 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 3తో ముగుస్తాయి. ఈ వేడుకలకు బోరియాస్‌ పురాణాన్ని ప్రామాణికంగా చెబుతారు. ఇక్కడి ప్రజలు శీతకాలపు దేవుడుగా బోరియాస్‌ను కొలుస్తారు. కళ్లు చెదిరేలా జరిగే ఈ వేడుకల్లో ఐస్‌ పాలస్, మంచు శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ వేడుకల్లో గడ్డాల పోటీలు, హాట్‌ డిష్‌ పోటీలు, ఐస్‌ రన్‌ పోటీలు ఇలా చాలానే నిర్వహిస్తుంటారు. కనువిందు చేసే ఈ మంచు వేడుకను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. వివిధ దేశాల రాచ కుటుంబీకులు, ప్రముఖులు, అధికారులు ఇలా చాలామంది ఈ వేడుకకు ప్రత్యేకంగా హాజరవుతుంటారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)