Breaking News

మీ కాఫీ మరీ చేదుగా ఉందా? దీనికి కారణం తెలుసా? ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

Published on Mon, 02/03/2025 - 10:25

ఉదయాన్నే కమ్మని ఫిల్టర్‌ కాఫీ తాగితే మనసంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది మనలో చాలామందికి.   ఘుమఘుమలాడే కాఫీ వాసన ముక్కు పుటాలకు తగలగానే అదొక మధురానుభూతి  కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారు.  అయితే మరికొంతమందికి అబ్బా..ఆ చేదు ఎలా తాగుతార్రా బాబూ! అనిపిస్తుంది కదా. అసలు కాఫీ ఎందుకు చేదుగా ఉంటుందో ఎపుడైనా ఆలోచించారా? కాఫీలోని కెఫిన్  ఉండటం వల్లే చేదుగా  ఉంటుంది అనుకుంటున్నారా? కానీ కెఫిన్ లేని కాఫీ కూడా చేదుగా ఉంటుందట. అదేంటి అనుకుంటున్నారా?  ఇదిగో ఈ వివరాలు మీకోసం.

మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్సిటీలోని లీబ్నిజ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫుడ్ సిస్టమ్స్ బయాలజీ పరిశోధకులు ఇప్పుడు ఈ ప్రశ్నకు  సమాధానాన్ని గుర్తించారు. రోస్ట్‌ చేసిన అరబిక్‌ కాఫీలో చేదు సమ్మేళనాల కొత్త సమూహాన్ని గుర్తించారు. చేదును అవి ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధించారు. అలాగే ఈ వేయించే పదార్థాలు ఎంత చేదుగా ఉంటాయో నిర్ణయించడంలో వ్యక్తిగత జన్యు సిద్ధత కూడా పాత్ర పోషిస్తుందని వారు మొదటిసారి ప్రదర్శించారు. 

అరబికా బీన్స్‌లో ఉండే ‘మోజాంబియోసైడ్‌‘ అసలైన కారణమట. ఇది కెఫిన్ కంటే పది రెట్లు ఎక్కువ చేదుగా ఉంటుంది. మానవ శరీరంలో కనిపించే సుమారు 25 చేదు రుచి గ్రాహక రకాల్లో రెండు, అవి TAS2R43, TAS2R46 గ్రాహకాలు. వీటిని ఇది బాగా యాక్టివేట్‌ చేస్తుంది. ‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కూడా కాల్చి పొడి చేస్తారు.  అయితే ఈ గింజలను  రోస్ట్‌ చేసే ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది.  ఫలితంగా ఒక్కో దశలో ఒక్కో రుచి వస్తుందని పరిశోధకుడు లాంగ్‌  చెప్పారు. రుచి, దాని సున్నితత్వం  అనేవి జన్యు సిద్ధతపై ఆధారపడి ఉంటుందని ఒక జన్యు పరీక్షలో వెల్లడైంది.

చదవండి: హీరోయిన్ల బాటలో 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం

మోజాంబియోసైడ్  పదార్థం ఉన్న కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ తాగిన పదకొండు మందిలో ఎనిమిది మందికి ఎక్కువ చేదుగా రుచిని గ్రహించడానికి మోజాంబియోసైడ్ దారితీసిందని ఒక పరీక్షలో తేలింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు. 

అయితే తమ కొత్త పరిశోధనలు కాఫీ రుచిని వేయించే ప్రక్రియ ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మన అవగాహనను పెంచుతాయని మరింత సమన్వయంతో కూడిన  కొత్త కాఫీ రకాల అభివృద్ధికి దోహదపడతాయని పరిశోధకులు తెలిపారు.  చేదు పదార్థాలు ,వాటి గ్రాహకాలు శరీరంలోని ఇతర అంశాలను బట్టి ఉంటుందనీ, వీటిలో చాలా వరకు ఇప్పటికీ తెలియని పరిశోధకులు తెలిపింది. దీనిపై  మరింత పరిశోధన జరగాల్సి ఉందని లాంగ్‌ తెలిపారు.  

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)