Breaking News

సూర్యుడి శీతకన్ను : డీ విటమిన్‌ లోపిస్తే నష్టమే

Published on Thu, 08/01/2024 - 15:53

శరీరానికి  కావాల్సిన ముఖ్యమైన విటమిన్లలోఒకటి విటమిన్‌ డీ. డీ విటమిన్‌ లోపంతో ఆనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విటమిన్‌ లోపం ఉందని  నిర్ధారణ అయితే,  వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ప్రధానంగా వర్షాకాలంలో  సూర్యరశ్మి తక్కువగా   ఉంటుంది. అందుకే  సన్‌షైన్‌ విటమిన్ అని కూడా పిలువబడే విటమిన్ డి చాలా అవసరం. విటమిన్‌డీ లోపిస్తే కాల్షియం లోపం కూడా  ఏర్పడుతుంది.  ముఖ్యంగా  మహిళలకు విటమిన్‌ డీ,కాల్షియం   ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

దాదాపు ఎనభై శాతం మంది పురుషుల్లో, మహిళల్లో దాదాపు తొంభై శాతం, విటమిన్‌ డీ లోపం ఉంటుంది. విటమిన్ డీ కాల్షియం లోపం మెలనోమా ప్రమాదాన్ని పెంచుతుంది మెలనోమా అభివృద్ధి చెందే ప్రమాదం ఉన్న మహిళలు విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవాలి. తగినంత విటమిన్ డీ లేకపోతే, శరీరం తగినంత కాల్షియంను గ్రహించదు. దీంతో ఎముకలు  బలహీన పడతాయి. ముఖ్యంగా పెద్దవారిలో బోలు ఎముకల వ్యాధి , ఎముకలు విరిగిపోవడం లాంటి  ప్రమాదాన్ని నివారించాలంటే ఇది అవసరం.

రోగనిరోధక వ్యవస్థకు మద్దతు
విటమిన్ డీ  తెల్ల రక్త కణాల పోరాట ప్రభావాన్ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది.  సాధారణ జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్‌ల వంటి అనారోగ్యాలను అరికట్టడంలో పాయపడుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని విటమిన్ డీ చాలా అవసరం. విటమిన్ డీ  లోపిస్తే డిప్రెషన్  వస్తుంది.

గుండె ఆరోగ్యానికి
విటమిన్ డీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాల పనితీరులో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది

బరువు నియంత్రణ
జీవక్రియ ,ఆకలి నియంత్రణలో  సమర్థవంతంగా పనిచేస్తేంది. డీ విటమిన్‌ లోపిస్తే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ డి తో టైప్ 2 డయాబెటిస్ రిస్క్  తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాధ్యత వహించే హార్మోన్ ఇన్సులిన్‌ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయ పడుతుంది.  టైప్ 2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

విటమిన్ డీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, గుండె జబ్బులు కేన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సహా అనేక ఆరోగ్య పరిస్థితుల నియం‍త్రణలో ఉపయోగ పడుతుంది.  విటమిన్ డి గ్రాహకాలు మెదడులో ఉంటాయి. న్యూరోప్రొటెక్షన్‌లో ఇది పాత్ర పోషిస్తుంది. మతిమరపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే డీ విటమిన్‌ అవసరం.

చర్మ ఆరోగ్యం
విటమిన్ డి చర్మ కణాలను  బాగు చేస్తుంది. పెరుగుదల. చర్మం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితుల చికిత్సలో సహాయపడుతుంది. విటమిన్ డీ లోపాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకుని, వైద్యుల పర్యవేక్షణలో సప్లిమెంట్లను తీసుకోవాలి. తద్వారా  ముఖ్యమైన శారీరక విధులకు ఆటంకం లేకుండా చూసుకొని, వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలి. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)